Home » మ‌రొక‌సారి స్టార్ హీరోతో న‌టించ‌నున్న స‌మంత‌..!

మ‌రొక‌సారి స్టార్ హీరోతో న‌టించ‌నున్న స‌మంత‌..!

by Bunty
Ad

స‌మంత విడాకుల త‌రువాత త‌న కెరీర్‌పై ఎక్కువ‌గా శ్ర‌ద్ధ వ‌హిస్తోంది. వ‌చ్చిన ఏ ఆఫ‌ర్‌ను ఆమె తిర‌స్క‌రించ‌డం లేదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌ను ప్రాధాన్య‌త ఇస్తూ.. త‌న న‌ట‌న‌కు ప్ర‌శంసలు అందుకుంటుంది స‌మంత‌. ఇక య‌శోద సినిమా త‌రువాత వెబ్ సిరీస్ కు ఒకే చెప్పింది. దాంతో పాటే మ‌రోసారి ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో న‌టించ‌నుంది.

 

Advertisement

ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌కు కొద్ది రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం స‌న్నాహాలు ప్రారంభించాడు. దీని కోసం నిర్మాత‌లు ఎన్టీఆర్ స‌ర‌స‌న జ‌త క‌ట్టేందుకు స‌మంత‌ను అడిగార‌ట‌. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇది భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటుంద‌ట‌. ఇక దీనికి స‌మంత హీరోయిన్‌గా అనుకుంటున్న‌ట్లు టాక్‌. ఇక ప్ర‌స్తుతం స‌మంత శాకుంత‌లం సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దాదాపు ఈ సినిమా పూర్తి కావ‌స్తోంది. అదేవిధంగా ప్ర‌స్తుతం సామ్ ప్ర‌ధాన పాత్ర‌లో య‌శోద సినిమా తెర‌కెక్కుతుంది. ఇటీవ‌లే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. దీని త‌రువాత ప్రాజెక్ట్ ఆమె దాదాపు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేసే అవ‌కాశం ఉంద‌ట‌.

Advertisement

 

మునుపెన్న‌డూ లేని విధంగా స‌మంత పాత్ర‌ను ఎలివేట్ చేసే స్క్రిప్ట్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుద‌ల త‌రువాత జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి త‌రువాత హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించేందుకు నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. స‌మంత‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ గ‌తంలో జ‌నతా గ్యారేజ్ కోసం క‌లిసి ప‌ని చేసిన విష‌యం తెలిసిన‌దే. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రొక‌సారి ఈ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌మీద‌కు రాబోతుంది.

Visitors Are Also Reading