Telugu News » Blog » సమంత స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వైరల్…మార్కులు చూస్తే అవాక్కవ్వాల్సిందే…,!

సమంత స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వైరల్…మార్కులు చూస్తే అవాక్కవ్వాల్సిందే…,!

by AJAY

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది తారలకు చదువు అబ్బదు అని అనుకుంటారు. కానీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కూడా చదువులో రాణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చదువులోనూ ముందుండేవాడు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ మరీ సుశాంత్ సినిమాల కోసం ప్రయత్నించాడు. అంతే కాకుండా సుశాంత్ ఇంట్లో ఉండి కోడింగ్ నేర్చుకున్నాడు. అదేవిధంగా నటి సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది.

Ads
telugu-actress-Samantha-mark-list-

telugu-actress-Samantha-mark-list-

ఓవైపు చేస్తూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా టాలెంటెడ్ స్టూడెంట్ అని తెలుస్తోంది. దానికి కారణం ప్రస్తుతం సమంత స్కూల్ మార్కుల రిపోర్ట్ కార్డు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ రిపోర్ట్ కార్డును సమంత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రిపోర్ట్ కార్డులో సమంత మార్కులు చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. అన్ని సబ్జెక్టులను సమంతకు 80 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. అదేవిధంగా గణితంలో అయితే వంద శాతం మార్కులను సంపాదించుకుంది.

Ads

telugu actress Samantha mark list

సమంత 2001- 2002 లో చెన్నైలోని హోలీ ఏంజిల్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుంది. అంతే కాకుండా సమంత డిగ్రీ 2007లో పూర్తి చేసింది. డిగ్రీ కూడా సమంత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ లో పూర్తిచేసింది. డిగ్రీ లో సమంత బీకాం గ్రూప్ తీసుకుంది. ఇక పదవ తరగతి లోనే కాకుండా డిగ్రీలోనూ సమంత చదువులో రాణించింది. కానీ సమంత నటన పై ఉన్న ఆసక్తి తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చదువుకొనే కాదు నటనలోనూ తాను గ్రేట్ అని నిరూపించుకుంది.