Home » ఆ ప్రేమకు ఫిదా అయిన సమంత…మళ్లీ అక్కినేని ఇంట్లో కుడి కాలు పెట్టబోతుందా…?

ఆ ప్రేమకు ఫిదా అయిన సమంత…మళ్లీ అక్కినేని ఇంట్లో కుడి కాలు పెట్టబోతుందా…?

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ భారిన పడినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉండే సమంత గత కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంది. దాంతో సమంత సర్జరీ కోసం అమెరికా వెళ్ళింది అంటూ వార్తలు వినిపించాయి. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని… మరోవైపు సమంత తన పెదాలకు సర్జరీ చేయించుకునేందుకు వెళ్లిందని ఇలా రకరకాల వార్తలు నెట్టింట చెక్కర్లు కొట్టాయి.

Advertisement

ఇక సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తనకు మాయో సైటిస్ అనే వ్యాధి భారినపడినట్టు పేర్కొంది. దాంతో అభిమానులు …ప్రేక్షకులు సమంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత గత ఏడాది డిసెంబర్ లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

samantha nagachaithanya

కారణం ఏంటో బయటకు రాలేదు కానీ ఇద్దరూ విడాకులు తీసుకుని సపరేట్ గా ఉంటున్నారు. అయితే రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ కలవబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. సమంత మయోసైటిస్ భారిన పడటంతో అక్కినేని కుటుంబ సభ్యులు ఆమె కు సపోర్ట్ గా నిలిచారట.

samantha-akkineni

samantha-akkineni

వారి ప్రేమకు ఫిదా అయిన సమంత మళ్ళీ విడాకులు రద్దు చేసుకుని చైతును కలవాలని నిర్ణయించుకుంది అంటూ ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఇంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading