హీరో శ్రీ విష్ణు.. గురించి తెలియని వారుండరు. విభిన్నమైన కథలని ఎంపిక చేసుకునే హీరో శ్రీ విష్ణు.. మరో కొత్త రకమైన కథాంశంతో ముందుకు వస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలతో అందరినీ మెప్పిస్తున్న హీరో శ్రీ విష్ణు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వివిధ జోనర్స్ లో వరస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీ విష్ణు. తాజాగా మరో మూవీతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యాడు. శ్రీ విష్ణు హీరోగా చేసిన తాజా సినిమా ”సామజవరగమన”. రామ్ అబ్బారాజ్ దర్శకత్వంలో… ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది.
Advertisement
కథ మరియు వివరణ:
హీరో బాలు (శ్రీ విష్ణు) ప్రేమలో విఫలమయ్యి ప్రేమపైన నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు. ఈ క్రమంలో తనకు ఎవరైనా అమ్మాయి ఐ లవ్ యు చెబితే వెంటనే రాఖీ కట్టించుకుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి సరయు (రెబ మౌనిక జాన్) తో పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో బాలు అత్తయ్య కొడుకుకి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది. దీంతో బాలు సరయు ప్రేమకు పెద్దల అడ్డంకి వచ్చి పడుతుంది. చివరకు వీరి ప్రేమకథలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? ఈ మధ్యలో సరయు తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్) పాత్ర ఏమిటి? అలాగే బాలు తండ్రి (సీనియర్ నరేష్) డిగ్రీ పాస్ అయితే కోట్ల ఆస్తి దక్కేల అతని తాతయ్య రాసిన వీలునామా ఏమిటి? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
Advertisement
హీరో విష్ణు చేసిన ‘సామజవరగమన’ కథలో పెద్ద విషయం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే… ప్రేమించిన అమ్మాయి చెల్లెలు వరుస అవుతుందని తెలిసి హీరో ఏం చేశాడు? అనేది కాన్సెప్ట్! కానీ, కామెడీ ఫుల్లుగా ఉంది. అబ్బాయిని అమ్మాయి ఎందుకు ప్రేమించింది? అని చెప్పడానికి మంచి కారణం రాసుకున్నారు దర్శక రచయితలు! అయితే, అబ్బాయి ప్రేమలో పడటం, మిగతా కథలో అంత బలం ఉండదు. ప్రతిదీ సినిమాటిక్ గా ఉంటుంది. ముఖ్యంగా… హీరో హీరోయిన్లు వరుసకు అన్నా చెల్లెలు కారని మనం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
ప్లస్ పాయింట్స్ :
శ్రీ విష్ణు నటన
కామెడీ
కథ
దర్శకత్వం
మైనస్ పాయింట్స్ :
సన్నివేశాలు స్లోగా ఉన్నాయి
సెకండాఫ్
సాగదీత
రేటింగ్ : 3/5
ఇవి కూడా చదవండి
Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !