బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. యూబై దాటినా కూడా సల్మాన్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి పీటలు ఎక్కలేదు. అంతే కాకుండా పెళ్లి చేసుకోలేదు కానీ హీరోయిన్ లతో ప్రేమాయణాలు సల్మాన్ కు కొత్తకాదు. దాదాపుగా బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ లను వాడేశాడు అనే పేరు సల్లూ బాయ్ కి ఉంది. స్టార్ హీరోయిన్ లు కత్రీనా, కరీనా తో పాటూ మరికొంతమందితో సల్మాన్ ఖాన్ ప్రేమాయణాలు నడిపించాడని టాక్ ఉంది.
Advertisement
ఇదిలా ఉంటే సల్మాన్ మనసు ఇప్పుడు పూజా హెగ్డే పై పడింది అంటూ బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాల రివ్యూలు చెప్పే క్రిటిక్ ఉమైర్ సాదు ట్వీట్ సంచలనంగా మారింది. ఆ ట్వీట్ లో ఉమైర్…సల్మాన్ ఖాన్ ఇప్పుడు పూజా హెగ్డే తో ప్రేమలో పడ్డాడు.
Advertisement
Advertisement
తన రెండు సినిమాలకు హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రేమపక్షులు సమయం దొరికితే చాలు కాలక్షేపం చేస్తున్నారు. ఈ మాట ఆయన సన్నిహుతులే చెబుతున్నారు అంటూ ఉమైర తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే సల్లూ ఇప్పటి వరకూ ప్రేమలో పడటమే కానీ పెళ్లి చేసుకుంది లేదు. దాంతో పూజాను కూడా వదిలేస్తాడు అనే టాక్ ఉంది.
salman khan
ఇక పూజా విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతోంది. ఈ ఏడాది ఒక్క హిట్ పడకపోయినా స్టార్ హీరోల సినిమా ఆఫర్ లను అందుకుంటోంది. అంతే కాకుండా తమిళ్ లోనూ వరుస ఆఫర్ లను అందుకుంటోంది. తెలుగు తమిళ్ తో పాటూ ఇప్పుడు బుట్టబొమ్మ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోంది. మరి సల్మాన్ తో ప్రేమకథ ఈ అమ్మడి కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.