Home » ఆస్ప‌త్రిలో స‌ల్లూభాయ్‌.. నెట్టింట్లో ఫొటో వైర‌ల్..!

ఆస్ప‌త్రిలో స‌ల్లూభాయ్‌.. నెట్టింట్లో ఫొటో వైర‌ల్..!

by Bunty
Ad

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డిసెంబర్ 26న తెల్లవారుజామున‌ పాము కాటుకు గురైన విష‌యం విధిత‌మే. మహారాష్ట్రలోని పన్వేల్‌లో ఫామ్‌హౌస్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది. కాగా సల్లూ భాయ్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం (మహాత్మా గాంధీ మిషన్) ఆస్పత్రికి తరలించారు. విషం లేని పాము కరవడంతో ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జి అయ్యాడీ కండల వీరుడు. విషరహిత పాము అతడిని కుట్టింది. ప్రస్తుతం సల్మాన్ బాగానే ఉన్నాడు. ఫ్యాన్స్‌ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని మందులు, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారు ‘ అని సల్మాన్‌ తండ్రి సలీమ్ ఖాన్ తెలిపారు.

 

Advertisement

Advertisement

అయితే ఆస్పత్రిలో సల్మాన్ చికిత్స తీసుకుంటున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘ భాయిజాన్‌ త్వరగా కొలుకోవాలి’ అని కామెంట్లు పెడుతున్నారు.సల్మాన్‌ ఫామ్‌ హౌస్‌ అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ పాములు, కొండచిలువలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈక్రమంలోనే సల్మాన్‌ పాముకాటుకు గురయ్యాడని తెలుస్తోంది. కాగా డిసెంబ‌ర్ 27న‌ సల్మాన్ 56వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

 

పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అతనికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ‘రాధే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఇది అంచనాలను అందుకోలేకపోయింది. ఆతర్వాత బావ ఆయుష్‌ శర్మతో కలిసి ‘అంతిమ్‌’ చిత్రంలో నటించాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన ‘ఏక్‌ థా టైగర్’ సీక్వెల్‌ ‘టైగర్‌ 3’ సినిమాలో నటిస్తున్నాడు.

Visitors Are Also Reading