Telugu News » Blog » పవన్ సినిమాలో సల్మాన్..?

పవన్ సినిమాలో సల్మాన్..?

by Manohar Reddy Mano
Ads

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా… ఆ తరువాత భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో పవన్ నటిస్తున్నాడు. అయితే గబ్బర్సింగ్ వారి సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శకుసు హరీష్ శంకర్ పవన్ తో తీస్తున్న రెండో సినిమా ఇది కావడంతో దీని పైన భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

Ads

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ గాసిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేటంటే.. ఈ పవన్ సినిమా అయిన భవదీయుడు భగత్ సింగ్ లో బాలీవుడ్ స్టార్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య సల్మాన్ ఖాన్ ను దర్శకుడు హరీష్ శంకట్ కలిసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి దగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దాంతో హరీష్ శంకర్ సల్మాన్ తో నేరుగా సినిమా తీస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. అందుకే ఆయనను కలిసాడు అని కూడా అన్నారు.

Ads

కానీ తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. ఈ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించమని అడగడానికే హరీష్ సల్మాన్ కు కలిసినట్లు తెలుస్తుంది. అయితే సల్మాన్ పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించబోతున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే అన్న తరువాత తమ్ముడు పవన్ సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అయితే ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ కాలేదు. మరి చూడాలి తర్వాత ఏం జరుగుతుంది అనేది.

Ad

ఇవి కూడా చదవండి :

మిథాలీ వీడ్కోలుతో కెప్టెన్ గా హర్మాన్ ప్రీత్..!

మిథాలీ రాజ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?