Home » 24 గంటల్లో లక్షఫోన్ లు సేల్.. ఇంతకు ఆ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసా ?

24 గంటల్లో లక్షఫోన్ లు సేల్.. ఇంతకు ఆ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసా ?

by Anji
Ad

చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లతో కూడిన ఫోన్ లను తీసుకురావడంలో రియల్ మీది పెట్టింది పేరు. ఈ ఫోన్ లకు మార్కెట్ లో ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రియల్ మీ కొత్త ఫోన్ వచ్చిందంటే చాలా హాట్ కేకులా అమ్ముడుపోతుంటాయి. తాజాగా రియల్ మీ ఫోన్ నుంచి లాంచ్ అయిన కొత్త ఫోన్ అమ్మకాలు ఈ బ్రాండ్ క్రేజ్ కి ప్రత్యేక నిదర్శనమని చెప్పవచ్చు.  

Also Read :  మస్కిటో కాయిల్ పొగ పీల్చి… ఆరుగురు మృతి… వీటిని వాడటం అంత ప్రమాదమా!

Advertisement

భారత్ లో లాంచ్ చేసిన ఈ ఫోన్ కోసం యూజర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. రియల్ మీ సీ 55 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ తొలిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. భారత్ లో ఈ ఫోన్ విడుదలైన 24 గంటల్లో ఏకంగా లక్ష ఫోన్లు అమ్ముడు పోవడం విశేషం. ఈ ఫోన్ కి ఎంతటి క్రేజ్ ఉన్నదో చెప్పవచ్చు. ఇంతకి ఇంత పెద్ద సంఖ్యలో ఫోన్ లు అమ్ముడుపోవడానికి కారణమేంటి? ఇందులో అసలు అంతలా ఉన్నటువంటి ఫీచర్లు ఏంటి ? రియల్ మీ సీ 55 స్మార్ట్ ఫోన్ లో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ను అందించారు. మీడియా టెక్ హీలియో జీ88 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్ కి సపోర్ట్ చేస్తోంది. 4GB, 6GB, 8 GB RAM ఆప్షన్స్ తో లాంచ్ అయింది. 

Advertisement

Manam News

64GB, 128 GB ఇంటర్నల్ స్టోరేజీ అందించారు. అదేవిధంగా 1 TB వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజీకి సపోర్ట్ చేసే డెడికేటెడ్ మైక్రో ఎస్ డీ కార్డు స్లాట్ ఆఫర్ చేశాడు. కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్పీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేసే ఈ ఫోన్ లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ ధర రూ.10,999 నుంచి ప్రారంభం అవుతుంది. 4GB RAM +64 GB స్టోరేజీ వేరియంట ధర రూ.10,999, 6GB RAM+ 64GB వేరియంట్ ధర రూ.11,999, అదేవిధంగా 8GB RAM+ 128GB స్టోరేజీతో వచ్చే టాప్ ఎండ్ మోడల్ ధర రూ.13,999 గా ఉంది.  ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కొనెయ్యండి మీకు నచ్చిన ఫోన్ ని.. ఎంజాయ్ చేయండి. 

Also Read :  చిరంజీవి, వెంకటేష్, నాగార్జున “గంగోత్రి” సినిమాకి ముందుగా అనుకున్న హీరోస్ ! అల్లు అర్జున్ చేతికి ఎలా వెళ్ళింది ?

Visitors Are Also Reading