Home » క్రికెట‌ర్ల వేత‌నాలు….ఇండియాలో ఎంత‌? పాకిస్తాన్ లో ఎంత‌?

క్రికెట‌ర్ల వేత‌నాలు….ఇండియాలో ఎంత‌? పాకిస్తాన్ లో ఎంత‌?

by Azhar
Ad

ఇండియా, పాకిస్తాన్ లో క్రికెట్ కు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అందుకే ఇక్క‌డ‌ IPL అక్క‌డ‌ PSL ను స్టార్ట్ చేశారు. కానీ ఆట‌గాళ్ల‌కు ఇచ్చే రెమ్యున‌రేష‌న్ పాకిస్తాన్ తో పోల్చితే ఇండియాలో భారీ మొత్తంలో ఉంటుంది. బీసీసీఐ 4 విభాగాల్లో ఆట‌గాళ్ల‌కు (A+, A, B, C ) వేత‌నాల‌ను చెల్లిస్తుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌మ ప్లేయ‌ర్ల‌ను 3 కేట‌గిరీలుగా ( A, B, C ) విభజించింది.


గ్రేడ్ A+ :

Advertisement

  • BCCI:  ఏడాదికి రూ.7 కోట్లు. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, బుమ్రాలు ఈ కేట‌గిరీలో ఉన్నారు.
  • PCB:  ఈ కేట‌గిరీ లేదు

గ్రేడ్ A:

  • BCCI: ఏడాదికి రూ.5 కోట్లు.   ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, చ‌టేశ్వ‌ర్ పుజారా, ఆజింక్యా ర‌హానే, కేఎల్ రాహుల్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, మ‌హ‌మ్మద్ ష‌మీ, ఇశాంత్ శ‌ర్మ‌, కుల్దీప్ యాద‌వ్‌, రిష‌బ్ పంత్‌లు ఈ కేట‌గిరీలో ఉన్నారు.
  • PCB: ఏడాదికి రూ.61 ల‌క్ష‌లు. బాబ‌ర్ అజం, అజ‌ర్ అలీ, షాహీన్ షాలు ఈ కేట‌గిరీలో ఉన్నారు.

Advertisement

గ్రేడ్ B :

  • BCCI: ఏడాదికి రూ.3 కోట్లు., వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాద‌వ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, హార్దిక్ పాండ్యా, మ‌యాంక్ అగ‌ర్వాల్‌లు ఈ కేట‌గిరీలో ఉన్నారు.
  • PCB: ఏడాదికి 42 లక్ష‌లు. అస‌ద్ ష‌ఫీక్‌, హారిస్ సోహెల్‌, మ‌హ‌మ్మ‌ద్ అబ్బాస్‌, షాదాబ్ ఖాన్‌, ఆబిద్ అలీ, మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్, స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, షాన్ మ‌సూద్‌, యాసిర్ షా లు ఈ కేట‌గిరీలో ఉన్నారు.

గ్రేడ్C:

  • BCCI: ఏడాదికి రూ.1 కోటి. కేదార్ జాద‌వ్‌, న‌వదీప్ సైనీ, దీప‌క్ చాహ‌ర్‌, మ‌నీష్ పాండే, హ‌నుమ విహారి, శార్దూల్ ఠాకూర్‌, శ్రేయాస్ అయ్య‌ర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు ఈ కేట‌గిరీలో ఉన్నారు.
  • PCB: ఏడాదికి రూ.30 ల‌క్ష‌లు.  ఫ‌ఖ‌ర్ జ‌మాన్, ఇమాద్ వ‌సీం, ఇమామ్‌-ఉల్‌-హ‌క్‌, నసీం షా, ఇఫ్తిఖ‌ర్ అహ్మ‌ద్‌, ఉస్మాన్ శిన్వారిలు ఈ కేట‌గిరిలో ఉన్నారు.

Also Read: క‌రోనా బారిన ప‌డిన క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading