Home » స‌లార్ నుండి బిగ్ ట్రీట్..శృతి లుక్ రిలీజ్…!

స‌లార్ నుండి బిగ్ ట్రీట్..శృతి లుక్ రిలీజ్…!

by AJAY
Ad

టాలీవుడ్ అందాల తార శృతిహాస‌న్ నేడు పుట్టిన రోజు జ‌రుపుకుంటోంది. దాంతో ఆమె న‌టిస్తున్న ప‌లు చిత్రాల‌నుండి అప్టేట్ లు ప్ర‌క‌టిస్తున్నారు. ఇక శృతి ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న సలార్ సినిమాలోనూ హీరోయ‌న్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ 40శాతం వ‌ర‌కూ పూర్త‌య్యింది.

Advertisement

salar sruthi hasan

salaar sruthi hasan

ఇక శృతి పుట్టిన రోజు సంధర్భంగా స‌లార్ చిత్ర యూనిట్ కూడా ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్ ను విడుద‌ల చేస్తూ ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమాలో భాగం అయినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సినిమాలో ఆద్య అనే క్యారెక్ట‌ర్ లో శృతి హాస‌న్ న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమా బొగ్గు గ‌నుల మైనింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా శృతి లుక్ కూడా బొగ్గ‌గ‌నుల బ్యాగ్రౌండ్ లో క‌నిపిస్తోంది.

Advertisement

Visitors Are Also Reading