Home » ఆదిపురుష్ బాటలోనే సమంత నటించిన శాకుతలం..!

ఆదిపురుష్ బాటలోనే సమంత నటించిన శాకుతలం..!

by Anji
Ad

టాలీవుడ్ కథానాయిక సమంత  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె ప్రస్తుతం మయోసిటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నప్పటికీ యశోద, శాకుంతలం వంటి సినిమాల్లో నటించింది సమంత. ఇటీవల చేతికి సెలైన్ పెట్టుకుని  యశోద డబ్బింగ్ చెప్పింది సమంత. సమంత శాకుంతలం సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మేకింగ్ విషయం మార్పులు కనిపిస్తున్నాయి. కథ కంటే కథనాన్ని సినిమాను విజువల్ గా చూపించే విధానం పై మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో సినిమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 

Advertisement

తాజాగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను 3 డీ వెర్షన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలోకి సమంత నటిస్తున్న శాకుంతలం కూడా చేరింది. మహాభారతం ఇతి వృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ 3 డీ వెర్షన్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేసింది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా జరుపుకుంటోంది. 3 డీ పనులు పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను విడుదల తేదీని ప్రకటించనున్నారు. చిత్ర యూనిట్ ప్రకటనతో ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది.  

Advertisement

Also Read :  ప్రేమి విశ్వనాథ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

ఇదిలా ఉంటే సమంత శాకుంతలం సినిమాకి దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమా ఆయన కెరీర్ ని ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. 

Also Read :  కన్నడ స్టార్స్ రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి హీరోలు అయ్యేందుకు అంతలా కష్టపడ్డారా…! చివరికి థియేటర్ ముందు టికెట్లు….?

 

Visitors Are Also Reading