Home » థియేటర్ కు బుర్కాలో వచ్చి దొరికిపోయిన సాయిపల్లవి..!

థియేటర్ కు బుర్కాలో వచ్చి దొరికిపోయిన సాయిపల్లవి..!

by AJAY
Ad

నాచురల్ స్టార్ నాని అందాలతార సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యయన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో సాయి పల్లవి తో పాటు కృతి శెట్టి కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కానీ సాయిపల్లవి పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రోజి అనే దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటించి అలరించింది. ఈ సినిమాను కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.

Sai pallavi

Advertisement

Advertisement

అయితే తాజాగా సాయి పల్లవి హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ లో సినిమా చూసింది. అంతే కాకుండా ఈ సినిమాకు సాయిపల్లవి బర్కా ధరించి రావడం విశేషం. సాయిపల్లవి తోపాటు ఈ సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా సినిమాకు వచ్చారు. బుర్కా వేసుకుని వచ్చి ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన సాయిపల్లవి ఎంతో ఆనంద పడింది.

 

ఇక సాయి పల్లవి థియేటర్ కి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తెలుగు హీరోయిన్లు బుర్కాలు వేసుకొని సినిమా హాల్ కు వెళ్లిన ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా హీరోలు సైతం అప్పుడప్పుడూ ఎవరికీ తెలియకుండా సినిమా మధ్యలో వెళ్లి మళ్లీ బయటకు వస్తారు. అభిమానుల రెస్పాన్స్ ను లైవ్ లో చూడ్డానికి హీరో హీరోయిన్లు అలా చేస్తూ ఉంటారు.

Visitors Are Also Reading