Home » వివాహానికి సిద్ధమవుతున్న సాయిపల్లవి..!!

వివాహానికి సిద్ధమవుతున్న సాయిపల్లవి..!!

by Sravanthi
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఎంతో ఎనర్జిటిక్ గా చలాకీగా కనిపించే హీరోయిన్ సాయి పల్లవి. ఆమె తన నటనతో ఎంతోమంది అభిమానులను కనువిందు చేస్తోంది. ఈ మధ్యకాలంలో శ్యామ్ సింగరాయి లవ్ స్టోరీ సినిమాలతో సెన్సేషన్ హిట్ కొట్టి మరింత క్రేజ్ పెంచుకుంది. ఈ రెండు భారీ హిట్ కొట్టిన తర్వాత సాయి పల్లవి సైలెంట్ గా ఉండడం కొత్త ప్రాజెక్టులను కూడా కమిట్ కాకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యింది అన్నా రూమర్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి విరాటపర్వం అనే సినిమాలో చేస్తోంది.

Advertisement

 

ఇందులో రానా హీరో ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. విరాట పర్వం సినిమా రిలీజ్ తర్వాత సాయి పల్లవి వివాహం చేసుకోబోతోంది అని, అందుకోసమే ఆమె ఇప్పటి వరకు ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వలేదని తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే దీనిపై సాయిపల్లవి స్నేహితుడు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ వస్తున్నారు.

Advertisement

ఆమె ప్రాజెక్టు ఒప్పుకోక పోవడానికి ప్రధాన కారణం స్క్రిప్ట్ విషయంలో చాలా ఆలోచిస్తోందట. మంచి కథ దొరికితే చేస్తానని అందుకే వెయిట్ చేస్తోందని అంటున్నారు. అలాగే తొందరగా సినిమాలు కమిట్ కావద్దని పల్లవి పిక్స్ అయినట్టు తెలుస్తోంది.
చిరంజీవితో భోళాశంకర్ లో సిస్టర్ రోల్ చేయడానికి ఆఫర్ వస్తే సాయి పల్లవి తిరస్కరించిందని తెలుస్తోంది. నటిగా తనకు మరింత పేరు తెచ్చిపెట్టే పాత్రలే చేస్తుందట. అందుకే ఏ కొత్త సినిమాలకు ఆమె కమిట్మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

ALSO READ;

హోటల్ లో పని..రూ.500 జీతం…సమంత లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా…!

ఆచార్య‌, అఖండ సినిమాల్లో ఉన్న కామ‌న్ పాయింట్స్ మీరు గుర్తించారా..?

 

Visitors Are Also Reading