Home » సాయిప‌ల్ల‌వి షాకింగ్ నిర్ణ‌యం.. కార‌ణం అదేనా..?

సాయిప‌ల్ల‌వి షాకింగ్ నిర్ణ‌యం.. కార‌ణం అదేనా..?

by Anji

హీరోయిన్‌ సాయిప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆమె వైవిద్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మ‌ల‌యాళం చిత్రం ప్రేమ‌మ్ చిత్రం ద్వారా ప‌రిచ‌యం అయిన ఈ బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ కి దూరంగా ఉంటూ కేవ‌లం త‌న న‌ట‌న‌తోనే ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. కోట్లాది రూపాయ‌లు వ‌స్తాయ‌ని అస‌లు ఆలోచించకుండా త‌న‌కు సంతృప్తిని ఇచ్చే పాత్ర‌ల్లోనే న‌టిస్తానంటోంది సాయిప‌ల్ల‌వి. అందుకే ఆమె అంటే సినీ అభిమానుల‌కు ఎన‌లేని గౌర‌వం పెరిగింది.


ఇటీవ‌ల సాయిప‌ల్ల‌వి లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ గా మారిపోయింది. అందుకే సాయి ప‌ల్ల‌విని అభిమానులు లేడీ సూప‌ర్ స్టార్ అని పిలుస్తుంటారు. గ‌త కొంత‌కాలం నుంచి మాత్రం సాయిప‌ల్ల‌వికి బ్యాడ్ టైమ్ న‌డుస్తోంది. ఇటీవ‌ల నేచుర‌ల్ బ్యూటీ న‌టించిన చిత్రాల‌న్ని బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొడుతున్నాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన విరాట ప‌ర్వం బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇటీవ‌ల వ‌చ్చిన గార్గి సినిమా కూడా ఫ్లాప్ అయింది. వ‌రుస‌గా ఫ్లాప్ కావ‌డానికి ఆమె ఎంచుకున్న క‌థ‌ల‌నే తెలుస్తోంది. ఇక కేవ‌లం సందేశాత్మ‌క చిత్రాల‌ను మాత్ర‌మే ఎంచుకుంటూ వెళ్తున్న సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిన‌ప్ప‌టికీ క‌మ‌ర్షియ‌ల్ గా నిర్మాత‌ల‌కు మాత్రం నిరాశే మిగిలింద‌ని చెప్పాలి.


కొన్ని విష‌యాల్లో మారాల‌ని సాయిప‌ల్ల‌వికి నిర్మాత‌లు స‌ల‌హా ఇచ్చార‌ట‌. అయితే గ్లామ‌ర్ కి ప్రాధాన్య‌త ఉన్న క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను కూడా చేయాల‌ని చెప్పార‌ట‌. ఆఫ‌ర్స్ రాక‌పోతే క్లినిక్ అయినా పెట్టుకుంటా లేదా ఉద్యోగం అయినా చేసుకుంటా కానీ నా స్థాయిని మాత్రం త‌గ్గించుకొని ఇష్టం లేని సినిమాల్లో న‌టించ‌న‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేసింద‌ట సాయిప‌ల్ల‌వి. ఇక సాయిప‌ల్ల‌వి కెరీర్ క్లోజ్ అయిన‌ట్టేన‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న పంథాల్లోనే వెళ్లుతూ సాయి ప‌ల్ల‌వి హిట్ సాధిస్తుందా లేదా మ‌న‌సు మార్చుకొని గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!

Also Read : 

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ణ‌తి ఫోటోపై నెటిజ‌న్లు భారీ ట్రోలింగ్.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

జాతీయ ప‌తాకాన్ని రూపొందించిన పింగ‌ళి వెంక‌య్య గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading