Telugu News » Blog » ఆ స్టార్ హీరో మూవీలో సాయి పల్లవి.. భలే ఛాన్స్ కొట్టిందిగా..?

ఆ స్టార్ హీరో మూవీలో సాయి పల్లవి.. భలే ఛాన్స్ కొట్టిందిగా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల అందరిలో సాయి పల్లవికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది.. ఇప్పటికీ ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే చాలామందికి సాయి పల్లవి పేరు మాత్రమే గుర్తుకొస్తుంది. అలాంటి సాయి పల్లవి సినిమా ఒప్పుకుంది అంటే ఆ సినిమా తప్పనిసరిగా ఒక మెసేజ్ ఫుల్ గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. డబ్బు కోసం కాకుండా పదిమందిని మార్చడం కోసం సాయి పల్లవి పనిచేస్తుంది.

Advertisement

అలనాటి సౌందర్య, సావిత్రి ఏ విధంగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారో ప్రస్తుత హీరోయిన్లలో సాయి పల్లవి కూడా మంచి గుర్తింపు సాధిస్తుంది. సినిమా హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఈమె వరస ఆఫర్లు దక్కించుకుంటుంది. అలాంటి సాయి పల్లవి తాజాగా ఆ స్టార్ హీరో సినిమాలో చేయబోతుందట. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ నుండి సినిమా రాబోతున్న విషయం చాలామందికి తెలుసు. అయితే ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఫైనల్ చేశారట. అయితే ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తుందా లేదా అనేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఈ సినిమాలో ఒక టీచర్ పాత్ర ఉందట.

Advertisement

ఇది చిత్రంలోనే చాలా ముఖ్యమైన పాత్ర అని తెలుస్తోంది. అయితే ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్ సాయి పల్లవి అయితే బాగుంటుందని ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో గతంలో కూడా రకరకాల హీరోయిన్లు పేర్లు వినబడ్డాయి. కానీ తాజాగా సాయి పల్లవి ఫైనల్ చేసినట్టు సమాచారం అందుతుంది. దీనిపై అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ త్వరలో రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్లో రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

also read: