Telugu News » సమంతలా చేయడం నా వల్ల ఎప్పటికి కాదు…! 

సమంతలా చేయడం నా వల్ల ఎప్పటికి కాదు…! 

by Manohar Reddy Mano
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరియర్ లో కొంచెం వెనుక బడి పోయింది అనే చెప్పాలి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత తెలుగులో సమంతకు అవకాశాలు అనేవి తగ్గాయి. ఆ సమయంలోనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో ఓ ఐటం సాంగ్ చేసింది సమంత. ఆ పాటతో పాటుగా సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మళ్ళీ సామ్ కు అవకాశాలు పెరుగుతున్నాయి. కేవలం మన తెలుగులోనే కాకుండా బాలీవుడ్ నుండి కూడా సమంతకు ఛాన్స్ లు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో సమంతలా చేయడం నా వల్ల ఎప్పటికి కాదు అని హీరోయిన్ సాయి పల్లవి పేర్కొంది.
అలా ఎందుకు అంది అంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన సాయి పల్లవిని.. మీరు డ్యాన్స్ బాగా చేస్తారు కదా..! అయితే ఐటం సాంగ్స్ లో కూడా చేస్తారా అని ప్రశ్నించగా.. నేను చేయను తెలిపింది. నాకు ఐటం సాంగ్స్ చేయడం ఆశకు ఇష్టం ఉండదు. ఎందుకంటే సినిమాలో ఆ పాటలను ఒక్క ఉదేశ్యంతో పెట్టుకుంటారు. అయితే నేను మాములుగా యట్ చేసేటప్పుడే ఏదైనా డ్రెస్ నచ్చకపోతే వెంటనే చెప్పేస్తాను పల్లవి పేర్కొంది. ఇప్పటివరకు అయితే తనకు ఎప్పుడు ఓ ఐటం సాంగ్ లో చేయాలి అని అనిపించలేదు అంటూ పేర్కొంది.
ఇక అదే విధంగా మనిషి జీవితంలో కెరియర్ అనేది ఎంత ముఖ్యమో ప్రేమ కూడా అంతే ముఖ్యం అని చెప్పిన పల్లవి.. ఈ రెండింటిలో ఏది లేకపోయిన జీవితం అనేది ఫుల్ కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ హైబ్రిడ్ పిల్ల తెలుగులో మాత్రం పెద్దగా చేయడం లేదు. అయితే ఎన్టీఆర్ హీరోగా కొరత శివ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాలో సాయి పల్లవినే హీరోయిన్ గా అనుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా పక్కా కాలేదు. ఒకవేళ ఈ ఇద్దరు జోడి కడితే మాత్రం స్క్రీన్ మీద మాములుగా ఉండదు అనే విషయం తెలిసిందే

You may also like