Home » “విరూపాక్ష” సినిమాలో “హీరోయిన్ తల్లి”గా నటించిన నటి ఎవరో తెలుసా…?

“విరూపాక్ష” సినిమాలో “హీరోయిన్ తల్లి”గా నటించిన నటి ఎవరో తెలుసా…?

by Bunty

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా అదరగొడుతుంది. విరూపాక్ష అటు అమెరికాలో కూడా అదరగొడుతుంది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 21.00 చేరును 37 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక ఈ చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సైతం మంచి వసుళ్లను రాబడుతోంది.

ఇప్పుడు ఓటిటిలోనూ దుమ్ము లేపుతోంది విరూపాక్ష సినిమా. అయితే ఈ తరుణంలోనే ఈ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటి ఎవరు అని అందరూ ఆరా తీస్తున్నారు. హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటి పేరు సాయి కామాక్షి భాస్కర్ల. ‘ప్రియురాలు’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు విరూపాక్ష మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. కామాక్షి వృత్తిరీత్యా డాక్టర్.

ఎంబిబిఎస్ చదువుతున్న సమయంలో సాయి కామాక్షి 2018 వ సంవత్సరం గాను ఫెమినా మిస్ తెలంగాణ కిరీటం అందుకుంది. చైనాలో మెడిసిన్ చేసిన కామాక్షి అపోలో హాస్పిటల్ లో కూడా కొన్నాళ్లపాటు పనిచేసింది. ఆ తర్వాత సినీరంగంపై మక్కువతో మోడల్ గా చేస్తూనే పలు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రియురాలు సినిమాలో హీరోయిన్గా నటించగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మాత్రం అక్కినేని అఖిల్ అమెరికా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒక అమ్మాయిగా కామాక్షి కనిపించింది. ఆ తర్వాత రౌడీ బాయ్స్, మా ఊరి పొలిమేర, విరూపాక్ష చిత్రాల్లో నటించింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…

Ramabanam OTT : రామబాణం ఓటిటి డేట్ ఫిక్స్…. ఎప్పటినుంచి అంటే

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

 

Visitors Are Also Reading