టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైనటువంటి సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు తేజ్. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్.. కోలుకున్న తరువాత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష.
Also Read : Airtel యాడ్ అమ్మాయి మీకు గుర్తుందా ? ప్రభాస్ సినిమా తరువాత సైలెంట్..!
Advertisement
ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తన జీవితంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా “ఎవరో అంటున్నారు కదా అని పెళ్లి ఇప్పుడే చేసుకోను. నాకు నచ్చినప్పుడే నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తన జీవితంలో కూడా లవ్ బ్రేకప్ జరిగిందని.. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, ప్రేమించిన తరువాత విడిపోయామని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత అమ్మాయిలు అంటేనే భయం వేస్తుందని.. బ్రేకప్ తరువాత చాలా సైంటెట్ అయినట్టు వెల్లడించారు.
Advertisement
Also Read : 45 ఏళ్లు క్రాస్ చేసిన సబ్బరాజు వయసు….కానీ ఎందుకు పెళ్లిచేసుకోలేదో తెలుసా..?
ప్రధానంగా ప్రతీ మనిషికి ఓ లైఫ్ జర్నీ ఉంటుందని, అందులో పడటం, లేవడం అనేది సర్వసాధారణమని తెలిపారు. అలాగే సాయిధరమ్ తేజ్ లైఫ్ కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో దేవుడు యాక్సిడెంట్ రూపంలో చిన్న బ్రేక్ వేశాడు. అయితే తాను దాంట్లో నుంచి రికవర్ అయి చేస్తున్న ఫస్ట్ సినిమా విరూపాక్ష. ఈ చిత్రానికి కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంయుక్త మీనన్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : షూటింగ్ లో పడుకునే సీన్ చేస్తూ నిజంగానే గంటసేపు పడుకున్న NTR.