సాధారణంగా సెలబ్రిటీలు వచ్చినప్పుడు అధికారులు, పోలీసులు చేసే హంగామా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఓ హీరో వచ్చాడటే ఆ అతి మరి ఎక్కువవుతుంది. ఈ తరుణంలో ఆచారాలను తుంగలో తొక్కడమే కాస్త బాధకరం. ఇవాళ సాయి ధరమ్ తేజ్ విషయంలో కూడా అలాగే జరిగింది. శ్రీకాళహస్తిలో సందడి చేశాడు సాయితేజ్. రాహుకేతు పూజ చేయడంతో పాటు స్వామి వారిని దర్శించుకున్నాడు. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు కాస్త అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఆ మాత్రం అసౌకర్యం సహజం. కాకపోతే ఆలయ నిబంధనలు, ఆచారాలను పక్కన పెట్టడం చాలా విడ్డూరకరం.
Advertisement
స్వామి వారిని దర్శించుకునే క్రమంలో ఉపాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి వద్దకు వచ్చాడు. ఈ సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది సాయితేజ్ చేతికి హారతి పల్లెం అందించారు. స్వయంగా సాయితేజ్ చేతుల మీదుగా స్వామివారికి హారతి ఇప్పించారు. ఇక ఈ విషయంలో నిబంధనలను, ఆలయ ఆచారాలను అధికారులు, అర్చకులు పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాళహస్తిలో కేవలం అర్చకులు మాత్రమే పూజలు చేసి హారతులు ఇవ్వాలని, సామన్య జనం హారతి ఇవ్వడం నిశిద్దమని పేర్కొంటున్నారు కొంత మంది అర్చకులు. ఇందులో వాస్తవం ఎంత..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయనేది విషయంపై ప్రస్తుతానికి అయితే స్పష్టత లేనప్పటికీ విమర్శలు మొత్తం మొదలైపోయాయి.
Advertisement
ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కూడా ఇలా ప్రవర్తించలేదని.. సాయితేజ్ విషయంలో మాత్రం అర్చకులు, అధికారులు అత్యుత్సాహం చూపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ విషయంలో సాయితేజ్ తప్పులేదు. అతనికి ఆలయంలో ఆచారాలు-సంప్రదాయాలు తెలియాలనే రూల్ లేదు. మరోవైపు గతంలో సింగర్ మంగ్లీ ఈ ఆలయంలో ఒక పాటను షూట్ చేసింది. ఆమెకు అధికారులు దగ్గరుండి మరీ అనుమతులు ఇచ్చారు. గర్భాలయంలో గోడలపై ఉన్న పురాతన శాసనాలు ఓ యూట్యూబ్ ఛానెల్ లో దర్శనమిచ్చాయి. వీటితో పోల్చితే సాయితేజ్ తో హారతి ఇప్పించడం పెద్ద విషయమేమి కాదు అంటున్నారు జనాలు. ఇక ఏది ఏమైనప్పటికీ శ్రీకాళహస్తి ఆలయ ఆచార వ్యవహారాల విషయంలో ఎప్పటికప్పుడు ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయని సామన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అప్పటిలో సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..!
ఆ స్టార్ హీరోయిన్ సావిత్రి మనవరాలు అనే విషయం మీకు తెలుసా ?