Home » Sai Dharam Tej : కొంపముంచిన స్టెరాయిడ్స్..సినిమాలకు సాయిధరమ్ తేజ్ దూరం ?

Sai Dharam Tej : కొంపముంచిన స్టెరాయిడ్స్..సినిమాలకు సాయిధరమ్ తేజ్ దూరం ?

by Bunty
Ad

మెగా కుటుంబం నుంచి వచ్చిన స్టార్ హీరో సాయిధరమ్ తేజ్. సుప్రీం హీరోగా పేరుగాంచిన సాయి ధరంతేజ్… ఇటీవల కాలంలోనే విరుపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో సాయిధరమ్ తేజ్… ఆ తర్వాత సుప్రీం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఫ్లాఫ్ లు వచ్చినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతున్నాడు సాయిధరమ్ తేజ్.

Advertisement

ఇక రెండు సంవత్సరాల కిందట వినాయక చవితి రోజున సాయిధరమ్ తేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వేగంగా వెళ్లడంతో బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు సాయిధరమ్ తేజ్. ఇక ఈ గాయం అయ్యాక దాదాపు ఏడాదికాలం సినిమాలకు దూరమైన సాయిధరమ్ తేజ్… ఇప్పుడు మరో ఆరు నెలల పాటు సినిమాలకు దూరం అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సాయిధరమ్ తేజ్ చెప్పడం గమనార్హం.

Advertisement

తనకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో… తనకు వైద్యులు స్టెరాయిడ్స్ ఎక్కించారని చెప్పిన సాయిధరమ్ తేజ్… దానివల్ల తన ఫిట్నెస్ కూడా పోయిందని వెల్లడించాడు. ఇక తనకు యాక్సిడెంట్ అయిన సమయంలోనే ప్లేట్లు తన బాడీలో వైద్యులు అమర్చారని… వాటిని ఇప్పుడు తీస్తారని చెప్పాడు. సర్జరీ చేసి వాటిని.. తీసేయాలని చెప్పినట్లు గుర్తు చేశారు సాయి ధరమ్ తేజ్. ఇంకా దీని నుంచి కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని… అందుకే తాను సినిమాలకు దూరం కాబోతున్నట్లు వివరించాడు.

ఇవి కూడా చదవండి

ఈ ప్లేస్ లలో పుట్టుమచ్చ ఉంటే.. మీకు అదృష్టం మాములుగా పట్టదు !

ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది..ఇండియా, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే ?

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడున్నారు.. ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading