సినిమా ఇండస్ట్రీని తారల జీవితాలు బయటకు చాలా రిచ్ గా కనిపిస్తుంటాయి. దాంతో సినీతారలు ఎంతో లగ్జరీ లైఫ్ ను గుడుపుతున్నారని అనుకుంటారు. అయితే ఆఫర్ లు లేనట్లయితే వారికి సైతం కష్టాలు తప్పవు. ఆఫర్ లు ఉన్నంతకాలమే చేతిలో డబ్బులు ఉంటాయి. ఒక్కసారి క్రేజ్ తగ్గితే ఆఫర్ లు ఉండవు. సినిమా ఆఫర్ లు లేనట్టయితే చేతిలో డబ్బులు కూడా ఉండవు. ఇక ఒకానొక సమయంలో తాము కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురుకున్నామని హీరోయిన్ వితిక వెల్లడించింది.
వితిక హీరో వరుణ్ సందేశ్ ను వివాహం చేసుకుందన్న సంగతి తెలిసిందే. వరుణ్ సందేశ్ హ్యాపిడేస్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరవాత కొత్తబంగారులోకం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ఆ తరవాత చాలా సినిమాలలో హీరోగా నటించినప్పటికీ స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయాడు.
Advertisement
ఇక వితిక కూడా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఈ స్వీట్ కపుల్ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతే కాకుండా ఇద్దరూ కలిసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర అభిమానులను సైతం సంపాదించుకున్నారు.
అదే విధంగా వితిక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ దంపతులు తమకు ఎదురైన ఆర్థిక కష్టాల గురించి వెల్లడించారు. పెళ్లి తరవాత అమెరికాకు వెళ్లామని అన్నారు. అక్కడ ఓ బిజినెస్ ప్రారంభించాలని అనుకున్నామని కానీ వర్కౌట్ అవ్వలేదని చెప్పారు. ఒకానొక సమయంలో 5 వేలు కూడా లేని స్థితికి వచ్చామని తెలిపారు.