Home » చిరంజీవి అంతటి స్థాయికి ఎదగాల్సిన హీరో ‘సుమన్’ సినీ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులు ఎవరు ?

చిరంజీవి అంతటి స్థాయికి ఎదగాల్సిన హీరో ‘సుమన్’ సినీ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులు ఎవరు ?

by AJAY
Ad

సుమ‌న్ టాలీవుడ్ లో ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. ఇప్ప‌టి వాళ్ల‌కు సుమ‌న్ కేవ‌లం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానే తెలుసు కానీ ఒక‌ప్పుడు సుమ‌న్ స్టార్ హీరోగా రానించారు. అంతే కాకుండా టాలీవుడ్ లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న చిరంజీవికి సుమ‌న్ పోటీ ఇచ్చేవారు. అప్పుడు చిరంజీవి సుమ‌న్ తో పాటూ బాల‌య్య కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద పోటీ ప‌డేవారు. సుమ‌న్ తో సినిమాల‌ను నిర్మించేందుకు స్టార్ ప్రొడ్యూసర్ లు క్యూ క‌ట్టేవారు.

hero-suman-marriage

hero-suman-marriage

అయితే అనుకోకుండా జీవితంలో వ‌చ్చిన ఇబ్బందుల వల్ల సుమ‌న్ కెరీర్ త‌ల‌కిందులు అయింది. అంతే కాకుండా కొంత‌మంది క‌క్ష క‌ట్టి మ‌రీ సుమ‌న్ కెరీర్ ను నాశ‌నం చేశారు. ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. సుమ‌న్ స్టార్ హీరోగా ఎదుగుతున్న క్ర‌మంలో నీలి చిత్రాల కేసులో ఆయ‌న‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అప్ప‌ట్లో అలా చేసింది చిరంజీవి అంటూ త‌ప్పుడు ప్ర‌చారం జ‌రిగింది.

Advertisement

Advertisement

దానికి కార‌ణం సుమ‌న్ స్టార్ హీరోగా ఎద‌గ‌డం ఓర్వ‌లేక అనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ ఆ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని స్వ‌యంగా సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. కొంత‌మంది కుట్ర‌తో త‌న‌ను జైలులో పెట్టించార‌ని చెప్పారు. అప్పుడే సినిమా ఇండస్ట్రీ అంటే ఎలాంటిదో అర్థం అయ్యింద‌ని త‌న కోసం సినిమా ఇండ‌స్ట్రీ నుండి ఎవ్వ‌రూ ముందుకు రాలేద‌ని చెప్పారు.

 

జైలు నుండి వ‌చ్చిన త‌ర‌వాత త‌న‌తో ప‌నిచేయ‌డానికి ఒప్పుకున్న నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ లు సినిమాల‌ను క్యాన్సిల్ చేసుకున్నామ‌ని చెప్పారు. జైలు నుండి వ‌చ్చిన త‌ర‌వాత సుమ‌న్ చేసిన సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్స్ లేకుండా పోయాయి. దాంతో వ‌చ్చిన ప్ర‌తి సినిమాను క‌థ తో సంబంధం లేకుండా న‌టించ‌డం వ‌ల్ల వ‌రుస ఫ్లాప్ ల‌తో కెరీర్ ను న‌ట్టేట ముంచుకున్నాడు. అంత జ‌రిగిన‌ప్ప‌టికీ సుమ‌న్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతున్నాడు కానీ సినిమాల‌కు మాత్రం దూరం అవ్వ‌లేదు. అంతే కాకుండా కోట్ల విలువ చేసే భూమిని ఆర్మీ పేరిట రాసి రియ‌ల్ హీరో అని ప్ర‌శంస‌లు అందుకున్నారు.

Visitors Are Also Reading