సినిమా వాళ్ల జీవితాలు బయటకు ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తాయి కానీ వారి జీవితాల్లో కూడా విషాదం ఉంటుంది. చాలా మంది సినిమా తారల జీవితాల్లో చెప్పుకోలేని విషాదం ఉంది. టాలీవుడ్ కమెడియన్ లక్ష్మీకాంత్ జీవితంలో కూడా విషాదం ఉంది. లక్ష్మీకాంత్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ అల్లరి, కితకితలు సినిమా కమెడియన్ లక్ష్మీకాంత్ అంటే గుర్తుపట్టనివాళ్లు ఉండరు.
Advertisement
కితకితలు సినిమాలో అల్లరి నరేష్ కు డ్రైవర్ గా లక్ష్మీకాంత్ నటించారు. అంతే కాకుండా అల్లరి సినిమాలో వాచ్ మెన్ నటించి నవ్వులు పూయించాడు. మొత్తం వందకు పైగా సినిమాలలో లక్ష్మీకాంత్ నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. లక్ష్మీకాంత్ తమ్ముడు శోభన్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రానించాడు. ప్రభాస్ తో వర్షం, మహేశ్ బాబుతో బాబీ సినిమాలను శోభన్ తెరకెక్కించారు.
Advertisement
అలా టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు సాధించిన లక్ష్మీకాంత్ శోభన్ లు ఒక నెల వ్యవధిలోనే కన్నమూయడం టాలీవుడ్ ను విషాదంలోకి నెట్టివేసింది. అయితే తాజాగా లక్ష్మీకాంత్ గురించి ఆయన కూతురు ఆర్జే శ్వేత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన బాబాయ్ శోభన్ బాబి సినిమాతో నష్టపోయారని చెప్పింది. ఆ తరవాత వర్షం సినిమాతో లాభాలు వచ్చాయని కానీ ఆ తరవాత చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికఇబ్బందులు మొదలయ్యాయని చెప్పింది.
ఈ నేపథ్యంలోనే ఆయన ఆస్థులను సైతం అమ్ముకోవాల్సివచ్చిందని తెలిపింది. ఆ తరవాత ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారని ఆయన ఓ రోజు చనిపోయినట్టు వార్త రావడంతో వెంటనే వైజాగ్ వెళ్ళానని చెప్పారు. బాబాయ్ చనిపోయారు అనే బాధతో తన తండ్రి డిప్రెషన్ లోకి వెళ్లారని ఆ తరవాత నెల ఆయన కూడా కన్నుమూశారని శ్వేత ఆవేదన వ్యక్తం చేసింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చదవండి