తల్లిదండ్రులు ఏది చెప్పినా మన మంచికే చెపుతారు. తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టి జీవితాలను నాశనం చేసుకున్న వారు అనేకమంది ఉంటారు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం పేరెంట్స్ మాట వినకుండా జీవితాలను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. అలాంటి లిస్టులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ నటించి దశాబ్ద కాలం పాటు భానుప్రియ హీరోయిన్ గా రాణించారు.
Advertisement
తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. మొదట భానుప్రియ తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇతర భాషల్లోనూ నటించారు. టాలీవుడ్ విషయానికి వస్తే సితార సినిమాతో భానుప్రియ హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతోపాటు తన నటనతో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు.
Advertisement
హీరోయిన్ గానే కాకుండా తల్లి, అక్క పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా భానుప్రియ ప్రేక్షకులను అలరించారు. ఇలా సినిమా లైఫ్ లో ఎంతో సక్సెస్ అయిన భానుప్రియ రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించారు. చిన్ననాటి నుండి భానుప్రియను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. భానుప్రియ కూడా తల్లిదండ్రుల మాటను తీసేవారు కాదు. కానీ భానుప్రియ ఒకప్పటి కొరియోగ్రాఫర్ సుమతి కౌశల్ కుమారుడు ఆదర్శ్ కౌశల్ ను ప్రేమించారు.
ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి భానుప్రియ తల్లి నో చెప్పింది. అయినప్పటికీ భానుప్రియ తల్లిదండ్రుల మాట వినకుండా అమెరికాకు వెళ్లి ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఆదర్శ్ కౌశల్ నిజస్వరూపం బయటపడింది. ఇక కొంతకాలానికే ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో మరణించాడు. అయితే అప్పటికే భానుప్రియ కు ఒక కూతురు కూడా పుట్టింది ప్రస్తుతం భానుప్రియ కూతురుతోనే ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.
Also read : కాలకేయుడికి బాలయ్య బాబు చేసిన ఈ సాయం గురించి ఎంతమందికి తెలుసు..? తన జీవితాన్ని..!