Sad Quotes Telugu: సాధారణంగా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. జీవితం అన్నప్పుడు సుఖం, సంతోషం, బాధ, ప్రేమ వంటివి తప్పకుండా ఉంటాయి. వాటన్నింటిని ఎదుర్కొని నిలబడగలిగిన వారే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. వీటిలో ఏ ఒక్కటి కోల్పోయినా జీవితం సాఫీగా సాగదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వ్యవహరిస్తుంటారు. మంచి మనస్సుతో ఉండి మంచి కుటుంబంతో కలిసి మెలిసి ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా అన్ని వాటంతటా అవే వస్తాయి.
Advertisement
ముఖ్యంగా కుటుంబం అంటే మీకు ప్రేమ, వెచ్చదనం, అంగీకారం వంటివి లభిస్తాయి. దురదృష్టవశాత్తు అందరూ సంతోషకరమైన కుటుంబంలో భాగం కాలేరు. విషపూరితమైన కుటుంబ సంబంధాలు నమ్మశక్యం కానీ విధంగా హాని కలిగిస్తాయి. ఇది జీవితకాలం పాటు ఉండే మానసిక నొప్పి, ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. విషపూరిత ప్రవర్తన తారుమారు, నియంత్రణ నుండి భావోద్వేగ దుర్వినియోగం, నిర్లక్ష్యం వంటి అనేక విధాలుగా ఉండవచ్చు. ఈ ఆర్టికల్ లో మీకు కొన్ని కొటేషన్స్ అందిస్తాం.వీటిలో కొన్ని విచారకరంగా ఉండవచ్చు.మరికొన్ని సాధికారతను కలిగి ఉండవచ్చు. కానీ ఈ కోట్స్ మాత్రం మీరు మీ జీవితంలో ముందుకు సాగడానికి తప్పకుండా సహాయపడుతాయి.
- మీరు మీ బలహీనత గురించి బాధలో, ఏకాంతంలో ఉన్నపుడు మాత్రమే నేర్చుకోగలరు.
- చెడు ఆలోచనలను మీ శరీరంలో ఉంచుకొని, సంతోషంతో ఉండుటకు ప్రయతించకండి.
- ప్రేమలో పడే ముందు ఆలోచన చేయండి.. ప్రేమ రద్దు అయ్యాక మనస్సు బాధపడును.
- మీరు వాకాటి బాధకు కారణమైతే, వారు సంతోషంగా చూసుకొనుటకు భాద్యత మీదే.
- ప్రజలు మీ కళ్ళలో బాధను చూసేంతవరకు మీ బాధ అర్ధం కాదు.
- మీరు వేరొకరి బాధకు బాధ పడినట్టయితే అది మీరు బాధ పడితే వారి పట్ల ప్రేమను వ్యక్త పరుచును.
- మనకు సౌకర్యము లేని వారితో జీవించుట అన్నది బాధతో కూడిన విషయము.
- బాధా కరమన్నది మనలని చంపేస్తుంది, మీరు మీ బాధ అన్నది పంచుకోవాలి
- మీరు బాధగా ఉన్నట్లయితే అది మిమ్ములను వెర్రి వారిని చేయును. మీరు ఎప్పుడూ చేయలేని పనులను చేయును.
- మీ స్నేహితులు, బంధువులు ఎవరైతే బాధల్లో ఉంటారో వారిని పలకరించండి, వారితో మాట్లాడండి, ఓదార్చండి.
Advertisement
- బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలు అని చెప్పాలి అవసరానికి వాడుకుని వదిలేసే బాధలే బంధాల కన్నా గొప్పవి.
- జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది నిందలు వేసే వారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది.
- నా జీవితంలో నేను సంతోషంగా జీవిస్తున్నాను అనే దాని కంటేనేను సర్దుకుపోతూ జీవిస్తున్నాను అనేది నిజం.
- మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్లు పెరిగిపోతున్నారు
మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్లు తగ్గిపోతున్నారు. - నేను చదివిన పుస్తకం పేరు జీవితం నేను తప్పిన పరీక్ష పేరు గెలుపునేను పొందిన పట్టా పేరు ఓటమి చేస్తున్నటువంటి పోరాటం ప్రయత్నం..!
- ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితం అంటే ఏంటో నేర్పే గురువులు.
- సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము.
- రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసినవారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే.
- నన్ను పది అడుగుల దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే వంద అడుగుల దూరంలో ఉంటాను.