Home » స‌చిన్‌-అంజ‌లి ల‌వ్‌స్టోరీ.. వారి పెళ్లికి పెద్ద‌ల‌ను ఎవ‌రు ఒప్పించారో తెలుసా..?

స‌చిన్‌-అంజ‌లి ల‌వ్‌స్టోరీ.. వారి పెళ్లికి పెద్ద‌ల‌ను ఎవ‌రు ఒప్పించారో తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

ఎంత‌టి వారు అయినా ప్రేమ‌కు దాసోహ‌మ‌వ్వాల్సిందే. ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డ‌నానికి నానా తిప్ప‌లు ప‌డాల్సిందే. 18 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు మాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ 23 ఏళ్ల అంజ‌లి ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డానికి ఎన్నో తిప్ప‌లు ప‌డ్డాడ‌ట‌.

Advertisement

స‌చిన్ టెండూల్క‌ర్ క్రికెట్ ప్ర‌పంచంలోకి ప‌రిచ‌యం అక్క‌రలేని పేరు. ఎంతో మంది సీనియ‌ర్ల‌కు రాని పేరు, సంపాద‌ను 20 ఏళ్ల‌కే స‌చిన్ సొంతం అయ్యాయి. స‌చిన్ ఆడుతుంటే కోట్లాడి మంది అభిమానులు కళ్లు అప్ప‌గించి చూస్తుండే వాళ్లు. అత‌నిఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. వారి ఒక‌రు డాక్ట‌ర్ అంజ‌లి. సచిన్ అంటే ఆమెకు విప‌రీత‌మైన అభిమానం.

Also Read :  అలీ ప‌క్క‌న న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌..కార‌ణం ఏంటో తెలుసా..!

స‌చిన్‌కు కూడా అంజలీ అంటే విప‌రీత‌మైన ప్రేమ‌. అంజ‌లికి ఎలా ప్ర‌పోజ్ చేయాలో అర్థం కాలేదు. అయితే ఒకానొక రోజు ధైర్యం చేసి స‌చిన్ త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేశాడు. దీంతో ఆమె అంగీక‌రించ‌డం త‌న క‌న్న 6 సంవ‌త్స‌రాలు వ‌య‌స్సులో పెద్ద‌ది అయిన అంజలిని వివాహం చేసుకున్నాడు. అయితే స‌చిన్ ల‌వ్ స్టోరీలో మాత్రం ఎన్నో ట్విస్ట్ లున్నాయి.

Advertisement

స‌చిన్ త‌న 17 ఏళ్ల వ‌య‌స్సులోనే అంజలీతో ప్రేమ‌లో ప‌డ్డాడు. త‌న‌క‌న్నా వ‌య‌స్సులో దాదాపు ఆరేళ్లు పెద్ద‌. అయినా 1995లో అంజ‌లిని ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నాడు. అంజ‌లితో పెళ్లికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించాడు స‌చిన్‌. రెండు కుటుంబాల‌ను పెళ్లికి ఒప్పించే బాధ్య‌త అంజ‌లికే అప్ప‌గించాను అని స‌చిన్ చెప్పాడు.

పెద్ద‌ల‌ను ఒప్పించి తాము ఎలా పెళ్లి చేసుకున్నామో ఇటీవ‌ల స‌చిన్ ఓ టీవీ షోలో వెల్ల‌డించాడు. 1994లో న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో అది జ‌రిగింది. ఆక్లాండ్‌, వెల్లింగ్‌ట‌న్ల‌లో వ‌రుస‌గా చ‌క్క‌ని ఇన్నింగ్స్ ఆడుతూ మంచి ఫామ్‌లో ఉన్నాను. అప్పుడే అంజ‌లీ న‌న్ను క‌లిసి పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చింది. నేను స‌రే అన్నాను.


రెండు కుటుంబాతో నువ్వె మాట్లాడి ఒప్పించాల‌ని చెప్పాను. అప్ప‌టికే ఇంట్లో వారికి అంజ‌లీతో ప‌రిచ‌యం ఉన్నా నాకు ఎందుకో పెళ్లి విష‌యం మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపించింది. అందుకే నువ్వు ఇరు కుటుంబాల‌ను ఒప్పిస్తే రేపే పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధం అని అంజ‌లితో అన్నాను. అంజ‌లినే మా పెళ్లి గురించి అంద‌రినీ ఒప్పించింద‌ని స‌చిన్ చెప్పుకొచ్చాడు.

1995 మే 24న ఈ జంట ఒక్క‌టైంది. ఆ త‌రువాత వీరిద్ద‌రికీ ఇద్ద‌రూ పిల్ల‌లు జ‌న్మించారు. వారే అర్జున్‌, సారా టెండూల్క‌ర్‌లు, అర్జున్ క్రికెట్‌లోనే త‌న‌ను కొన‌సాగిస్తుండ‌గా సారా లండ‌న్‌లో ఉన్న‌త చ‌దువులు అభ్య‌సిస్తోంది.

Also Read :  ఏపీ మంత్రి గౌతమ్‌ రెడ్డి చివరి ఫోటో ఇదే..!

Visitors Are Also Reading