Home » Virat Kohli : రోహిత్‌ కు షాక్‌…మళ్లీ టీమిండియా కెప్టెన్‌ గా కోహ్లీ ?

Virat Kohli : రోహిత్‌ కు షాక్‌…మళ్లీ టీమిండియా కెప్టెన్‌ గా కోహ్లీ ?

by Bunty
Ad

సెంచూరియాన్ టెస్ట్ లో టీమిండియా ఓటమి తర్వాత కెప్టెన్సీపై డిబేట్ నడుస్తుంది. కొందరు విమర్శకులు రోహిత్ ను టార్గెట్ చేస్తున్నారు. వైట్ బాల్ ఫార్మాట్లో హిట్ మ్యాన్ కెప్టెన్ గా కొనసాగినా, టెస్టులకు మాత్రం పర్ఫెక్ట్ ఆప్షన్ కాదని కొందరు మాజీలు అంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కూడా స్పందించారు. కెప్టెన్ గా కోహ్లీ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. టెస్టుల్లో రోహిత్ తో పోలిస్తే విరాట్ కు ట్రాక్ రికార్డు బాగుందని అన్నారు. విదేశాల్లో టెస్టు ఓపెనర్ గాను హిట్ మాన్ ఇంకా నిలదొక్కుకోలేదన్నాడు. అయినా రోహిత్ ను టెస్ట్ కెప్టెన్ గా నియమించారన్నారు.

Advertisement

లాంగ్ ఫార్మాట్ కెప్టెన్ గా హిట్ మ్యాన్ కు బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం కాదన్నాడు. టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ రికార్డులను బద్రీనాథ్ గుర్తు చేశారు. 52కు పైగా యావరేజ్ తో 5 వేలకు పైగా పరుగులు సాధించాడన్నాడు. కెప్టెన్ గా 68 మ్యాచుల్లో 40 విజయాలు అందుకోవడం మాటలు కాదన్నాడు. అయితే కెప్టెన్సీపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా పరాజయం తర్వాత రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు డిమాండ్ చేశారు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇప్పుడు సెంచూరియన్ టెస్ట్ రిజల్ట్ తర్వాత కోహ్లీని కెప్టెన్ ను చేయాలని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ టెస్టుల్లో విరాట్ వంటి కెప్టెన్ లేని లోటు కనిపిస్తుందని, గతంలోనూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా కామెంట్ చేశాడు. ఇక ఇప్పుడు శ్రేయస్ అయ్యర్, పంత్, కేఎల్ రాహుల్, శుబ్ మన్ గిల్ పేర్లు ఫ్యూచర్ కెప్టెన్ లిస్టులో వినిపిస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రాణించాక రహనే పేరు కూడా కెప్టెన్సీ రేసులో వినిపించింది. కానీ వెస్టిండీస్ టూర్ లో రహనే విఫలమయ్యాడు.ఇప్పుడు జట్టులో లేకుండా పోయాడు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading