Home » రష్యాకు ఊహించని షాకిచ్చిన ఉక్రెయిన్..!

రష్యాకు ఊహించని షాకిచ్చిన ఉక్రెయిన్..!

by Anji
Ad

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య వార్ వారం రోజులుగా న‌డుస్తూనే ఉంది. ముఖ్యంగా పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌పై బాంబుల వ‌ర్షం కురిపించ‌డం ఊహించిన‌దే. అమెరికా కూడా ప‌దే ప‌దే ఆ మాటే చెప్పింది. అన్నింటికి మించి పుతిన్ ట్రాక్ రికార్డు కూడా అదే పేర్కొంటోంది. ఆయ‌న క్రిమియాను ఎన్న‌డూ ర‌ష్యాలో క‌ల‌ప‌లేరనుకున్నాం. కానీ క‌లిపేసుకున్నారు. డోన్బాస్‌లో యుద్ధం ప్రారంభించ‌ర‌నుకున్నాం. కానీ ఆయ‌న ఎంత‌కైనా తెగిస్తాడ‌ని తెలుసు. ఇప్పుడు అణ్వ‌స్త్రాల‌ను బ‌యటికి తీసుకొస్తున్నాడు.

Advertisement

తాజాగా ర‌ష్యా అధ్య‌క్షుడు తాజాగా త‌న దేశ అణుబ‌ల‌గాల‌ను అప్ర‌మ‌త్తం చేసారు. నాటో నాయ‌కులు ఉక్రెయిన్ విష‌యంలో చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లే దీనికి కార‌ణం అని పుతిన్ వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌పై సైనిక చ‌ర్య గురించి ఆయ‌న టీవీలో ప్ర‌క‌టిస్తున్న‌ప్పుడు ప్ర‌పంచానికి వ‌ణుకు పుట్టించే విధంగా స్ప‌స్ట‌మైన హెచ్చ‌రిక చేసారు. ఇందులో జోక్యం చేసుకోవాల‌ని ఎవ‌రైనా భావించినా, జోక్యం చేసుకున్నా చ‌రిత్ర‌లో చూడ‌ని అతి తీవ్ర ప‌ర్య‌వ‌సానాల‌ను ఎదుర్కుంటార‌ని హెచ్చ‌రించాడు. పుతిన్ అణ్వాయుధం ప్ర‌యోగించినా ఆశ్చ‌ర్య ప‌డాల్సింది ఏమి లేదు. యుద్ధంలో ఏదైనా సంభ‌వ‌మే. ప్ర‌స్తుతం ఆయ‌న చూపిస్తున్న అణు బూచి కూడా అలాంటిదేనా..?

Advertisement

పాశ్చాత్య దేశాలు ఆర్థికంగా ఆయ‌న‌ను అష్ట‌దిగ్భంధ‌నం చేశాయి. దాంతో యూరోప్‌లో ఒంట‌రి అయ్యారు. ఇదిలా ఉండ‌గా.. ర‌ష్యా దేశానికి ఊహించ‌ని షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆండ్రీ సుఖోవిట్‌స్కీని హ‌త మార్చిన‌ట్టు ఉక్రెయిన్ సైన్యం ప్ర‌క‌టించింది. ర‌ష్య‌న్్ జ‌న‌ర‌ల్ మ‌ర‌ణించిన‌ట్టు నెక్ స్ట్రా మీడియాతో పాటు బెలార‌స్ మీడియా కూడా ధృవీక‌రించింది. సైనిక ప‌రంగా ఇది ర‌ష్యాకు పెద్ద ఎదురు దెబ్బ‌గా భావించ‌వ‌చ్చు. ర‌ష్యా మాత్రం ఆండ్రీ మృతిని ఇంకా ధృవీక‌రించ‌లేదు. అదేవిధంగా తొమ్మిది వేల మందికి పైగా ర‌ష్యా సైనికుల‌ను తాము హ‌త‌మార్చిన‌ట్టు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది విదేశాంగ శాఖ‌. త‌మ సామ‌ర్థ్యం త‌క్కువ అయిన‌ప్ప‌టికీ ర‌ష్యా 9వేల మంది ఆర్మీ సైనికుల‌ను మ‌ట్టి క‌రిపించామ‌ని స్ప‌స్టం చేసింది. ర‌ష్యా యుద్ధంలో త‌గ్గ‌క త‌ప్ప‌ద‌ని యుద్దం అనంత‌రం తిరిగి ఉక్రెయిన్ దేశాన్ని మ‌ళ్లీ నిర్మిస్తాన‌ని ఆ దేశ అధ్య‌క్షుడు ప్ర‌క‌ట‌న చేశాడు.

Also Read :  ఉక్రెయిన్‌లో భార‌త విద్యార్థుల వెత‌లు.. ఆనంద్ మ‌హీంద్రా సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Visitors Are Also Reading