Home » ర‌ష్యా సైనికుల వాహ‌నాల‌పై జెడ్ అనే అక్ష‌రం ఎందుకు ఉంటుందో తెలుసా..?

ర‌ష్యా సైనికుల వాహ‌నాల‌పై జెడ్ అనే అక్ష‌రం ఎందుకు ఉంటుందో తెలుసా..?

by Anji
Ad

ఉక్రెయిన్ ర‌ష్యా మ‌ధ్య భీక‌ర యుద్ధం కొన‌సాగుతుంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల‌కు తెగ బ‌డుతోంది. ఉక్రెయిన్ కూడా ర‌ష్యా బ‌ల‌గాల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గ‌త నాలుగు రోజులుగా ఈ యుద్ధం కొన‌సాగుతుంది. ప‌లు న‌గ‌రాలు, మిల‌ట‌రీ బేస్‌ల‌పై ర‌ష్యా వైమానిక దాడులు కొన‌సాగుతున్నాయి. దీంతో వేలాది మంది పౌరులు అండ‌ర్ గ్రౌండ్స్‌లో దాక్కుండిపోయారు. అయితే ర‌ష్యాకు చెందిన ప‌లు సైనిక వాహ‌నాల‌పై జెడ్ (z) గుర్తు ఉంటుంది. ఈ గుర్తు ఎందుకు ఉంటుంద‌నేది చాలా మందిలో త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌.

Also Read :  రెచ్చిపోతున్న జ‌బ‌ర్ద‌స్త్ జోడీ…నీ మెడ‌లో నా తాలి అంటూ సుజాత‌పై రాకేష్ అరాచ‌కం..!

Advertisement

టెలిగ్రాఫ్ నివేదిక ప్ర‌కారం.. ఈ జెడ్ గుర్తు ర‌ష్యాకు చెందిన అన్ని సైనిక క‌నిపిస్తోంది. ఇదొక ర‌క‌మైన ఎర్ర‌జెండా లాంటిద‌ట‌. వీటిని రోజ్గా వార్డియా ట్రూప్స్ అని పిలుస్తుంటారు. ర‌ష్యా జాతీయ భద్ర‌తా ద‌ళం అని కూడా అంటార‌ట‌. ఖైదీల‌ను తీసుకెళ్లే ఎవ్‌టోజాక్స్ వాహ‌నాల్లో వీరంద‌రూ వెళ్తున్నారు. బెల్గొరోడ్ ప్రాంతంలోని ఈ వాహ‌నాల‌ను ఎప్పుడు ఈ జెడ్ గుర్తును ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ర‌ష్యా జాతీయ భ‌ద్ర‌తా ద‌ళాలు వాడే వాహ‌నాల‌పై ఈ జెడ్ గుర్తు ఉంటుంద‌ని.. దీనిని బ‌ట్టి ర‌ష్యా వీరిని కూడా రంగంలోకి దింపిందని అర్థం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ ర‌ష్యా అధ్యోఉడు పుతిన్ భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల‌ను మాత్ర‌మే చూస్తుంది.

Advertisement

వీరందరూ మెరిక‌ల్లాంటి జ‌వాన్ల‌ను, ఆర్మ్‌డ్ ఫోర్స్ కంటే మెరిక‌ల్లా విధులు నిర్వర్తిస్తార‌ని తెలుస్తోంది. ఏ ప్ర‌దేశంలోనైనా చోర‌బ‌డి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే శ‌క్తి ఈ బ‌ల‌గాల‌కు ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రొక వాద‌న ఏమిటంటే.. ర‌ష్యా సైనికులే ర‌ష్యా సైనికుల వాహ‌నాల‌పై కాల్పులు జ‌రప‌కుండా జెడ్ గుర్తు వాడుతార‌ని కూడా తెలుస్తోంది. ఇదొక ర‌క‌మైన క‌మ్యూనికేష‌న్ సిగ్న‌ల్స్ అని పేర్కొంటున్నారు. కేవ‌లం యుద్ధాల్లోనే వీటిని ఉప‌యోగిస్తార‌న్న మెస్సేజ్ కూడా ఇందులో ఉంటుంద‌ట. అధికారుల‌కు కూడా సుల‌భంగానే యుద్ధానికి ఉప‌యోగించే వాహ‌న‌మేదో తెలిసిపోవ‌డానికి జెడ్ అక్ష‌రం రాస్తార‌ట‌.

Also Read :  ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య వార్‌పై చైనా ఏమ‌న్న‌దంటే..?

Visitors Are Also Reading