Home » ఏవైపు ఉంటారో ఆలోచించుకోవాలి… ఇండియాకు రష్యా ఆయిల్ ఆఫర్ పై అమెరికా వ్యాఖ్యలు

ఏవైపు ఉంటారో ఆలోచించుకోవాలి… ఇండియాకు రష్యా ఆయిల్ ఆఫర్ పై అమెరికా వ్యాఖ్యలు

by Anji
Ad

ర‌ష్యా ఉక్రెయిన్ వార్ ప్ర‌భావంతో అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు చుక్క‌ల‌ను అంటుతున్నాయి. దేశంలో కూడా త్వ‌ర‌లోనే పెట్రోల్‌, డిజీల్ రేట్లు పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ స‌మ‌యంలో ర‌ష్యా.. ఇండియాకు సూప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. త‌క్కువ ధ‌ర‌కే క్రూడ్ ఆయిల్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని తెలిపింది.

Also Read :  ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై క్లారిటీ.. మే 06 నుంచి ప్రారంభం

Advertisement

తాజాగా ర‌ష్యా క్రూడ్ ఆయిల్ ఆఫ‌ర్ పై అమెరికా స్పందించింది. భార‌త‌దేశం ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించ‌దు కానీ ర‌ష్యా ఆయిల్ డీల్ న్యూఢిల్లీ చ‌రిత్ర‌లో త‌ప్పు వైపు ఉంచ‌వ‌చ్చు అంటూ వ్యాఖ్యానించింది. ర‌ష్యా నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ఇస్తే.. ర‌ష్యా దురాక్ర‌మ‌ణ‌కు కూడా మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టే అంటూ వ్యాఖ్యానించింది. చ‌రిత్ర‌లో మీరు ఎక్క‌డ ఉంటారో ఆలోచించుకోవాలంటూ వ్యాఖ్య‌లు చేసింది.

Advertisement

ఇటీవ‌ల ర‌ష్యా ఇండియాకు చాలా త‌క్కువ ధ‌ర‌కే క్రూడ్ అయిల్ ఎగుమ‌తి చేస్తాం అని ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఏకంగా ర‌ష్యా డిప్యూటీ ప్ర‌ధాని అలెగ్జాండ‌ర్ నోవాక్ ఈ విష‌యం గురించి నేరుగా కేంద్రంతో మాట్లాడార‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై నోవాక్ కేంద్రం హ‌ర్దీప్ పూరికి ఫోన్ చేసి మాట్లాడార‌ని తెలిసింది. ర‌ష్యా ఆఫ‌ర్ ను భార‌త్ స్వీక‌రించ‌డం అంత ఈజీ కాదు. ఇప్ప‌టికే యూరోపియ‌న్ దేశాల‌తో పాటు అమెరికా, కెన‌డా దేశాలు ర‌ష్యాపై తీవ్ర ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఈ దేశాల‌తో భార‌త్ బ‌ల‌మైన ఆర్థిక‌, వాణిజ్య సంబంధాలున్నాయి. ర‌ష్యా ఇచ్చే ఆఫ‌ర్‌ను తీసుకుంటే దేశంలో ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కు పెట్రోల్ ల‌భించే అవ‌కాశం ఉంది. భార‌త ప్ర‌భుత్వం ఎటువైపు మొగ్గుచూపుతుందో వేచి చూడాలి.

Also Read :  ఏపీ సీఎం జ‌గ‌న్‌కు నారా లోకేష్ లేఖ.. ఎందుకంటే..?

Visitors Are Also Reading