సినీ నటుడు అల్లు అర్జున్‌కి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లీగల్ నోటీసులు పంపారు. ర్యాపిడో బైక్ టాక్సీ యాప్ ప్రమోషన్ కోసం చేసిన వీడియోలో RTC ని కించపరిచేలా చూపించారని పేర్కొంటూ అల్లు అర్జున్ తో పాటు ర్యాపిడో సంస్థకు కూడా నోటీసులు పంపించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
Advertisement
Advertisement
ఈ ప్రకటనలో RTC బస్సులో మామూలు దోశగా ఎక్కిన వాళ్లను సైతం కైమాగా కొట్టి మసాలా దోశగా మారుస్తారనే కామెంట్ తో పాటు…. RTC బస్ లో క్కికిరిసిపోయిన జనాలను చూపుతూ చేసిన ప్రకటన . RTC ని కించపరిచేలా ఉందని అన్నారు సజ్జనార్. అందుకే ఆ యాడ్ లో నటించిన నటుడికి సదరు సంస్థకు నోటీసులు పంపినట్టు తెలిపారు. సెలెబ్రిటీలు ప్రజా రవాణ వ్యవస్థను ప్రోత్సాహించే ప్రకటనల్లో పాల్గొనాలని హితవు పలికారు.
అల్లు అర్జున్ కి RTC పంపిన లీగల్ నోటీస్
RTCని కించపరిచేలా రూపొందించిన ర్యాపిడో యాడ్: