Home » Latha Mangeshkar : రూ. 200 కోట్ల‌కు సంబంధించిన లతాజీ ఆస్తులు ఎవ‌రికో..?

Latha Mangeshkar : రూ. 200 కోట్ల‌కు సంబంధించిన లతాజీ ఆస్తులు ఎవ‌రికో..?

by Anji
Ad

భార‌తర‌త్న అవార్డు గ్ర‌హీత‌, లెజెండ‌రీ సింగ‌ర్ ల‌తా మంగేష్క‌ర్ ఇక లేర‌న్న వార్త‌ను అభిమానులు అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆమె మ‌ర‌ణంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. వేల పాట‌ల‌తో ఆమె దాదాపు 78 ఏళ్ల పాటు సంగీత ప్రియుల‌ను మైమ‌రింపించింది. ఆమె త‌న 92వ యేటా క‌న్నుమూసింది. చిన్న‌ప్ప‌టి నుంచే పాట‌లు పాడ‌డం ప్రారంభించిన ల‌తా మంగేష్క‌ర్ ఇండియ‌న్ నైటింగ‌ల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

హిందీ, మ‌రాఠీ, తెలుగుతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో 50వేల‌కు పైగా పాట‌లు పాడిన ఘ‌నత ఈ ఇండియ‌న్ నైటింగల్ త‌న గొంతుతో సంగీత ప్రియుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నారు. త‌న కెరీర్ చివ‌రి వ‌ర‌కు స్టార్ గాయ‌నిగా వెలుగు వెలిగిన ల‌తాజీ రెమ్యున‌రేష‌న్ కూడా అత్య‌ధికంగానే తీసుకునేవారు.

Advertisement

Latha mangeshkar

Latha mangeshkar

పెళ్లి కూడా చేసుకోని ల‌తా మంగేష్క‌ర్ ఆస్తుల చిట్టా చాలా పెద్ద‌ది. ఆమె నిక‌ర ఆస్తుల విలువ దాదాపు రూ.200 కోట్ల‌కు పైగానే ఉంది. మ‌ర‌ణాంతరం వారి ఆస్తులు భ‌ర్త లేదా పిల్ల‌ల‌కు ద‌క్కుతాయి. చివ‌రి వ‌ర‌కు బ్ర‌హ్మ‌చారిగా ఉన్న ల‌తాజీ ఆస్తులు ఎవ‌రికీ చెందుతాయ‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది

ALSO READ :  మూడ‌వ పెళ్లికి సిద్ధ‌మైన క‌రాటే క‌ల్యాణి.. అందుకోస‌మేనా..?

Advertisement

Latha mangeshkar

Latha mangeshkar

ముఖ్యంగా ఆమె చెల్లెలు ఆశా భోంస్లే, మీన ఖ‌డిక‌ర్ ఉషా మంగేష్క‌ర్ సోద‌రుడు హృద‌య‌నాథ్ మంగేష్క‌ర్‌కు త‌క్కుతాయ‌ని అంటున్నారు. అలాగే త‌న తండ్రి పేరుపై క‌ట్టించిన ట్ర‌స్ఠ్ కూడా ల‌తా ఆస్తులు వెళ్లే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చెల్లెలు, సోద‌రుడు గాయ‌కులుగా మంచి పొజిష‌న్‌లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. దీంతో ల‌తా ఆస్తులు ట్ర‌స్ట్ కు వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. ల‌తాజీ చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దువు మానేసి మ‌రీ త‌న జీవిత‌మంతా కుటుంబాన్ని పోషించ‌డం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డింది.

ఆమె మృతి చెంద‌డంతో ఆస్తులు ఎవ‌రి పేరుపై రాశార‌నేది స‌స్పెన్స్‌లో ఉండిపోయాయి. మ‌రీ దీనిపై ఆమె లాయ‌ర్ ఎలాంటి చేయ‌నున్నార‌నేది మాత్రం కొద్ది రోజుల వ‌ర‌కు వేచి చూడాలి. ఓ మీడియా ఇచ్చిన ప్ర‌కారం.. ల‌తా మంగేష్క‌ర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల‌కు పైగానే ఉంటాయ‌ని తెలుస్తోంది. చివ‌రి వ‌ర‌కు ఆమె ప్ర‌భు కుంజ్ అనే నివాసంలోనే ఉన్నారు.

Latha mangeshkar

Latha mangeshkar

అంతేకాదు ముంబై పెద్ద‌ర్ రోడ్డులో మ‌రొక విలాస‌వంత‌మైన ఇల్లు కూడా ఉంది. ఆమెకు పాట‌ల ద్వారానే కాక అద్దెల రూపంలో కూడా సంపాద‌న వ‌స్తుంది. ముఖ్యంగా ఆమె పాడిన పాట‌ల‌కు రాయ‌ల్టీ ద్వారా సంవ‌త్స‌రానికి దాదాపు రూ.5కోట్లకు పైగానే ఆదాయం వ‌చ్చేద‌ట‌. ల‌తాజీ ఆస్తులు ఎవ‌రికీ ద‌క్కుతాయ‌నేది మాత్రం కొద్ది రోజులు వేచి ఉండ‌క త‌ప్పదు.

ALSO READ :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి

Visitors Are Also Reading