రష్యా అధ్యక్షుడు పుతిన్ తన పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై జరుపుతున్న రణానికి సొంత ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. యుద్దం చేయొద్దు అంటూ రష్యా నగరాల్లో ప్రజలు నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రష్యా రాజధాని నగరమైన మాస్కోలో ప్రజలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అక్కడ పోలీసులు ఉన్నా వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిరసనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read : VIRAL VIDEO : అవే ఎక్స్పెషన్స్..అదే గ్రేస్.. ఖుషి పాటకు భూమిక స్టెప్పులు..!
Advertisement
Advertisement
అయితే అక్కడి పరిస్థితులను అదుపు చేసే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కేవలం ఒక్క మాస్కోనగరంలోనే దాదాపు 1000 మంది వరకు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 1979లో ఆప్గానిస్తాన్ పై రష్యా దాడి తరువాత జరుగుతున్న ఈ సైనిక చర్యను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ప్రజలను మారణహోమం నుండి రక్షించేందుకే ఈ సైనిక చర్య అని పుతిన్ చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా బహిరంగ లేఖలు, ఆన్‌లైన్ పిటీషన్ల సంతకాలు చేస్తూ.. ఈ యుద్ధాన్ని ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ తమకు శత్రువు కాదని.. ఆ దేశానికి రష్యా ప్రజలు మద్దతు ఇవ్వడం గమనార్హం. ఈ అనధికార నిరసనలు చట్ట విరుద్ధం అంటూ రష్యా ఇన్విస్టిగేటివ్ కమిటీ ఓ హెచ్చరిక జారీ చేసింది. మున్ముందు చట్ట పరమైన చర్యలు ఎదురు అవుతాయని తెలిసినా.. వారు ఆగడం లేదు.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారి ఆలోచలు స్థిరంగా ఉండవు