Home » Video Viral : ఆర్ఆర్ఆర్ కోసం శ్ర‌మించిన చ‌ర‌ణ్

Video Viral : ఆర్ఆర్ఆర్ కోసం శ్ర‌మించిన చ‌ర‌ణ్

by Anji

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా సంద‌డి మార్చి 24 అర్థ‌రాత్రి నుంచే ప్రారంభ‌మైంది. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ న‌ట‌న విశ్వ‌రూపం చూపార‌ని రాజ‌మౌళి టేకింగ్ అద్భుతం అని న‌గ‌టు ప్రేక్ష‌కుడితో పాటు ప్ర‌ముఖులు నెట్టింట కొనియాడుతున్నారు. ఈ ఆనందోత్స‌హంతో రామ్‌చ‌ర‌ణ్‌కు శిక్ష‌ణ ఇచ్చిన ప్ర‌ముఖ బాక్స‌ర్ నీర‌జ్ గోయ‌త్ ఓ వీడియోను ట్వీట్ చేశారు.


నీర‌జ్ గోయ‌త్ ఆధ్వ‌ర్యంలో చ‌ర‌ణ్ బాక్సింగ్ ప్రాక్టిస్ చేసిన దృశ్యం. ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాక్సింగ్ కు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ మాత్ర‌మే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ సోద‌రుడు రామ్‌చ‌ర‌ణ్ ఎంతో క‌ష్ట‌ప‌డి బాక్సింగ్ నేర్చుకున్నారు. ప్రాణం పెట్టి న‌టించారని నీర‌జ్ పేర్కొన్నారు.

హ‌రియాణాకు చెందిన నీర‌జ్ 2017లో ఆన‌ర‌రీ బాక్స‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ 2018లో మోస్ట్ ప్రామిసింగ్ బాక్స‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డులు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్‌లోని త‌న పాత్ర కోసం చ‌ర‌ణ్ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో మీరే చూడండి.

 

Visitors Are Also Reading