Home » మూతపడుతున్న థియేటర్లు..అసలు ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా..?

మూతపడుతున్న థియేటర్లు..అసలు ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా..?

by AJAY
Ad

కరోనా అన్ని పరిశ్రమలతో పాటూ సినిమా పరిశ్రమను తెగ ఇబ్బంది పెడుతోంది. మహమ్మారి అంటే సినిమా వాళ్ళు వణికిపోతున్నారు. దానికి కారణం విజృంభణ మొదలైంది అంటే షూటింగ్ లు వాయిదా పడుతున్నాయి. థియేటర్లు మూత పడుతున్నాయి. ఇక సెకండ్ వేవ్ తరవాత మళ్లీ అఖండ , పుష్ప సినిమాలతోనే ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టారు. అయితే మళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ షురూ అయ్యింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో మళ్ళీ థియేటర్లకు మళ్లీ ఆంక్షలు విధించే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పటికే థియేటర్స్ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

Advertisement

 

మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, కర్ణాటక లో నైట్ కర్ఫ్యూ లు విధించారు. కేరళ రాష్ట్రంలో జనవరి 1 నుండి లాక్ పెట్టే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ లోనూ ఒక్కరోజులోనే 60కి పైగా ఒమిక్రోన్ కేసులు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాలు రాధే శ్యామ్ , ఆర్ ఆర్ ఆర్ విడుదలకు రెడీగా ఉన్నాయి. వీటిలో ఆర్ ఆర్ ఆర్ జనవరి ,7 విడుదల కానుండగా….రాధే శ్యామ్ 14న విడుదలకు సిద్దం ఉంది. ఇప్పటికే ఈ చిత్రాల ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. కానీ ఒమీక్రాన్ టెర్రర్ తో ఈ రెండు సినిమాలు విడుదల అవుతాయా లేదా అన్న టెన్షన్ మొదలైంది. మరి సినిమాలు విడుదల అవుతాయో లేదో చూడాలి.

Visitors Are Also Reading