Home » ఎన్టీఆర్ కు ఇష్ట‌మైన స్టంట్ అదే… తల్లి కాదంద‌ని…

ఎన్టీఆర్ కు ఇష్ట‌మైన స్టంట్ అదే… తల్లి కాదంద‌ని…

by Bunty
Ad

తెలుగు ఇండస్ట్రీలో విల‌క్ష‌ణ న‌టుల్లో ఒక‌రు ఎన్టీఆర్‌. న‌టుడు అనేవాడు సౌక‌ర్య‌వంత‌మైన పాత్ర‌లు చేస్తూ ఉండిపోకూడ‌ద‌ని, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేసిన‌పుడే ఎక్కువకాలం సినీరంగంలో నిల‌బ‌డ‌గ‌లుగుతార‌ని న‌మ్మే వ్య‌క్తుల్లో ఎన్టీఆర్ కూడా ఒక‌రు. ఇప్ప‌టికే వివిధ రకాల పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్ నిన్న రిలీజ్ అయింది.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ కీల‌క విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు. చిన్న‌త‌నం నుంచి అజ‌య్‌దేవగ‌ణ్ సినిమాలు చూస్తూ పెరిగాన‌ని, దేవ‌గ‌ణ్ సినిమాల్లోని పూల్ ఔర్ కాంటే చిత్రంలో బైక్ స్టంట్ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని, అలాంటి స్టంట్ చేసేందుకు త‌న‌కు అవ‌కాశం వ‌స్తుందేమో చూశాన‌ని అన్నారు. ఇలాంటి స్టంట్‌లు సినిమాల్లో మాత్రమే బాగుంటాయ‌ని, బ‌య‌ట చేయ‌డం బాగోద‌ని త‌న తల్లి వారించిన‌ట్టు ఎన్టీఆర్ పేర్కొన్నారు. తాను సౌక‌ర్య‌వంతంగా ఉన్నాన‌ని అనుకున్న‌ప్పుడ‌ల్లా రాజ‌మౌళి త‌న‌లోని విల‌క్ష‌ణ న‌టుడిని బ‌య‌ట‌కు తీస్తుంటార‌ని ఎన్టీఆర్ తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading