యావత్ సినీ ప్రపంచం ఎదురుచూపులకు నేటితో తెరపడింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇవాళ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇవాళ ఆర్ఆర్ఆర్ మూవీ ట్రెండ్ నడుస్తోంది. ఇద్దరు హీరోల అభిమానులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రేక్షకులు ఇలా అందరూ ఈ సినిమాను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఒకసారి సినిమా చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా సినిమాలో 10 సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొంటున్నా ఆ పది సన్నివేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
తొలుత రామ్ చరణ్ పరిచయం సీన్ హైలెట్‌గా నిలిచిందనే చెప్పాలి. పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్‌గా అతను చూపించిన హావభావాలు ఆసీన్‌లో భారీ స్థాయిలో జనాలు ఉండడం ఎంతగానో గ్రాండ్‌గా అనిపించింది.
ముఖ్యంగా కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. ఫారెస్ట్‌లో ఎన్టీఆర్ పవర్‌పుల్ బాడీతో అలా నిలబడి ఇంట్రడక్షన్ ఇవ్వడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంటుంది.
ఇక నాటు నాటు సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టారు.
Advertisement
రాజమౌళి మార్క్‌కు తగ్గట్టుగా హై విజువల్ బాండింగ్‌తో దోస్తీ సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఎమోషనల్ గా సాగే కొమరం భీముడు సాంగ్ కూడా గుండెను తాకే విధంగా ఉంది. ఇది కూడా సినిమాను మరొక మారు చూసేలా ఉంటుంది.
అన్నింటి కంటే ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందుగా వచ్చే సీన్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ యాక్షన్ అదుర్స్ అనే చెప్పవచ్చు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ తడబడడం కూడా హైలెట్.
అలియాభట్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ కూడా హైలెట్.
ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో కూడా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హై ఓల్డేజ్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది.
ఇద్దరి ఫ్రెండ్‌షిఫ్ కూడా మరొక లేవల్‌లో ఉండనే చెప్పాలి.
రాజమౌళి ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పవచ్చు.
ఇక క్లైమాక్స్ సన్నివేశాన్ని తీర్చిదిద్దడం మరో మేజర్ ప్లస్ పాయింట్ ఇలా మొత్తం పది అంశాలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి.
Also Read : RRR : అంత పెద్ద సినిమాలో ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారేంటి..?