Home » సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. ర‌న్ టైమ్ ఎంత అంటే..?

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. ర‌న్ టైమ్ ఎంత అంటే..?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ మూవీగా న‌టించిన రౌద్రం రణం రుధిరం మ‌రొక వారం రోజుల్లో అన‌గా మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వ్వ‌నుంది. ముఖ్యంగా ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డం,మ‌ల‌యాళం, భాష‌ల్లో భారీగా విడుద‌ల చేయ‌నున్నారు.

Advertisement

Advertisement

తాజాగా సినిమాకు సంబంధించి సెన్సార్ రిపోర్టు వ‌చ్చింది. ఈ చిత్రానికి సెన్సార్‌స‌భ్యులు యూ/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాకుండా ఈ మూవీ ర‌న్‌టైమ్ కూడా తెలిసిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా ర‌న్ టైమ్ 3 గంట‌ల 6 నిమిషాల 54 సెక‌న్లు. అంటే మ‌ధ్య‌లో ఇంట‌ర్వెల్‌తో క‌లుపుకుని దాదాపు మూడు గంట‌ల 20 నిమిషాలు అన్న మాట‌. దీంతో సింగిల్ థియేట‌ర్ల‌లో షో టైమింగ్స్ మారిపోయే అవ‌కాశ‌ముంది. రాజ‌మౌళి గ‌త చిత్రం బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ ర‌న్ టైమ్ 2 గంట‌ల 47 నిమిషాలు. ఇప్పుడు బాహుబ‌లి కంటే ఆర్ఆర్ఆర్ ర‌న్‌టైమ్ ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Also Read :  విడాకుల త‌ర‌వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న స‌మంత‌…ఏం చేసిందంటే..!

Visitors Are Also Reading