ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా స్టామినా ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాకు ఆస్కార్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ఈ సినిమా కోసం వెతుకుతున్నారు. సినిమా చూసిన తరవాత సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. జక్కన్న ఈ సినిమాతో విజువల్ వండర్ ను క్రియేట్ చేశాడు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండటం..కథ స్క్రీన్ ప్లే పాటలు..నటన ఇలా ప్రతి ఒక్కటీ ప్రేక్షకులను మెప్పించాయి.
Advertisement
ALSO READ :Honey Rose : లేటు వయస్సులో పెళ్లికి సిద్ధమైన బాలయ్య బ్యూటీ…వరుడు ఎవరంటే?
అయితే సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏ రేంజ్ లో తమ నటన మరియు డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారో తెలిసిందే. కానీ ఈ సినిమాలో హీరోలు గా మొదట ఆఫర్ వేరే హీరోలకు వచ్చింది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ సినిమాకు కథను అందించిన విజయేంద్రప్రసాద్ ఈ నిజాన్ని ఓ ఇంటర్వ్యూలో భయటపెట్టారు.
Advertisement
మొదట ఈ సినిమా కథను రాసుకునేటప్పుడు తమిళ స్టార్ రజినీ కాంత్ మరియు అర్జున్ లతో ఈ సినిమాను తీయాలని అనుకున్నారట. కానీ అది కుదరలేదు….ఆ తరవాత తమిళ స్టార్స్ సూర్య ఆయన సోదరుడు కార్తీ లతో ఈ సినిమాను చేయాలని నిర్నయించుకున్నారట కానీ అది కూడా కుదరలేదు.
ఆ తరవాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు తమిళ స్టార్ కార్తీలతో ప్లాన్ చేశారట అది కూడా కుదరలేదు. మరోవైపు కమల్ హాసన్ రజినీకాంత్ లతో కూడా ఈ ప్రాజెక్ట్ బాగుంటుందని అనుకున్నారు. కానీ అది కూడా ఫిక్స్ అవ్వలేదు ఇక హీరో కోసం వెతికి వెతికి చివరికి ఆఫర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు వచ్చింది. అయితే వీరిద్దరూ కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
Advertisement
ALSO READ : గుత్తా జ్వాల – విష్ణు విశాల్ జంట విడాకులు..?