Home » ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..? అప్పుడ‌లా ఇప్పుడేమో ఇలా…!

ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..? అప్పుడ‌లా ఇప్పుడేమో ఇలా…!

by AJAY
Ad

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించారు. ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో న‌టించ‌గా రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో నటించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్, రామ్ చ‌రణ్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భ‌ట్ న‌టించారు. అంతే కాకుండా అజయ్ దేవ్ గన్, శ్రీయ స‌ర‌న్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు.

rrr-movie-logic-1

Advertisement

 

థియేట‌ర్ ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో అల‌రించిన ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో విడుద‌లైంది. ఓటీటీలో పే ప‌ర్ వ్యూ విధానంతో విడుద‌ల చేయ‌గా అక్క‌డ కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అయితే థియేట‌ర్ లో ఈ సినిమాను చూసిన ప్రేక్ష‌కులు కూడా మ‌రోసారి ఓటీటీలో చూస్తున్నారు. థియేట‌ర్ లో ఉండే హంగామాకు కేవ‌లం సినిమా క‌థ‌ను అందులోని జోక్స్ ను ఎంజాయ్ చేస్తారు కానీ ఓటీటీలో అలా కాదు. సినిమాను చాలా క్లారిటీగా చూస్తుంటారు.

Advertisement

rrr-movie-mistake

rrr-movie-mistake

 

ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్ లోని కొన్ని మిస్టేక్ ల‌ను ప‌ట్టుకుని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో మ‌ల్లిని తీసుకువ‌చ్చేందుకు వెళ్లిన ఎన్టీఆర్ ఒకే బోనులో పులులు జింక‌ల‌ను తీసుకువెళ‌తాడు. ఒకే బోన్ జింక‌లు పులుల‌ను తీసుకెళ్ల‌డం ఏంటి అని ఇప్ప‌టికే ట్రోల్స్ వ‌స్తుండ‌గా ఇప్పుడు నెటిజ‌న్లు మ‌రో మిస్టేక్ ను కూడా ప‌ట్టేశారు. సినిమాలో రాహుల్ రామ‌కృష్ణను మొద‌టిసారిగా రామ్ చ‌ర‌ణ్ చూసిన‌ప్పుడు పెయింటింగ్ వేస్తూ క‌నిపిస్తాడు. రామ్ చ‌ర‌ణ్ ను చూడ‌గానే అక్కడ నుండి పారిపోతాడు.

 

కాగా ఎన్టీఆర్ స్నేహితుడిగా చ‌ర‌ణ్ వ‌చ్చిన‌ప్పుడు రాహుల్ రామ‌కృష్ణ అత‌డి భుజం పై చేయివేస్తాడు. కానీ అప్పుడు అత‌డి వేళ్ల‌కు ఎలాంటి రంగు క‌నిపించ‌దు. కానీ రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ఒలివియా వెళుతున్న వాహనం పై అదే రంగుతో ఉన్న ఒక డిజైన్ చూడ‌గా వెంట‌నే రాహుల్ రామ‌కృష్ణ చేతివేళ్ల‌కు ఉన్న రంగును గుర్తు చేసుకుంటాడు. అప్పుడు రంగు క‌నిపిస్తుంది. ఇక ఈ మిస్టేక్ ను ప‌ట్టేసిన నెటిజన్లు మ‌రోసారి జ‌క్క‌న్న పై ట్రోల్స్ చేస్తున్నారు.

ALSO READ : F3 MOVIE REVIEW : ఎఫ్ -3 సినిమా రివ్యూ & రేటింగ్…!

Visitors Are Also Reading