Telugu News » ‘ఆర్ఆర్ఆర్’ రామ్- భీమ్ ల సోలో స్టిల్స్ విడుద‌ల

‘ఆర్ఆర్ఆర్’ రామ్- భీమ్ ల సోలో స్టిల్స్ విడుద‌ల

by Bunty

ప్ర‌స్తుతం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎక్క‌డ విన్నా.. ఆర్ఆర్ఆర్ గురించే చ‌ర్చ మొద‌ల‌వుతుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 07, 2022 న ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుంది. ముఖ్యంగా చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎప్పుడు వ‌స్తుందా ఆర్ఆర్ఆర్ మూవీ చూద్దామ‌ని ఇటు రాజ‌మౌళి, అటు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ అభిమానులంద‌రూ ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్‌ల‌ను వేగవంతం చేసారు మూవీ మేక‌ర్స్‌.. ముఖ్యంగా ఫ్యాన్స్‌కు రోజుకొక ట్రీట్ ఇస్తున్నారు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుండి విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ రికార్డులు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.

Ads

 

ఇక అభిమానుల ఆత్రుత గుర్తించిన మూవీ మేక‌ర్స్ తాజాగా మ‌రొక సారి అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ సోలో పిక్స్‌ను విడుద‌ల చేశారు. కేవ‌లం అభిమానుల కోసం త‌మ అల్లూరి సీతారామ‌రాజు అలాగే.. కొమురంభీం ఎన్టీఆర్‌ల సోలో స్టిల్స్‌ను విడుద‌ల చేసి ఫ్యాన్స్‌లో ఉత్సాహం రేకెత్తించారు. అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ ఇంటెన్సివ్ పోలీస్ లుక్‌లో క‌నిపించ‌గా.. కొమ‌రంభీమ్‌గా ఎన్టీఆర్ చిరున‌వ్వు చిందిస్తూ.. క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్‌గా మారాయి. తమ అభిమానుల హీరోల‌ను ఈ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ మ‌రింత రెచ్చిపోతున్నారు. త‌మ హీరోల ఫొటోలు ఎలా ఉన్నాయంటూ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

 


You may also like