Home » RRR లో ఈ అయిదు సీన్స్ లేకపోతే సినిమా ప్లాప్ అయ్యేదట ! నిజమేనా ?

RRR లో ఈ అయిదు సీన్స్ లేకపోతే సినిమా ప్లాప్ అయ్యేదట ! నిజమేనా ?

by AJAY
Ad

రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా వ‌చ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ రికార్డులు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. వెయ్యి కోట్ల క్ల‌బ్ లో చేరి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజు పాత్రలో నటించారు.

Advertisement

యాక్షన్స్ మరియు ఎమోషనల్ సీన్లతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాలో కొన్ని సీన్లు మాత్రమే హైలెట్ గా నిలిచాయ‌ని ఆ సీన్లు లేకపోయి ఉంటే ఆర్ఆర్ఆర్ ఒక చెత్త‌ సినిమా అయ్యిండేద‌ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ఐదు సీన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం….సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల‌ ఇంట్రడక్షన్ సీన్ ల గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.

Advertisement

ఈ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఫైట్ ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ట్టుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కొమరం భీమ్ చేసిన పులుల ఫైట్ సీన్ కూడా సినిమాలో ఒక హైలెట్ అని చెప్పుకుంటున్నారు.

rrr-movie-review

అదేవిధంగా కొమురం భీముడో పాట ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింద‌ని చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య ఉండే ఫ్రెండ్షిప్ సీన్లు కూడా ఈ సినిమాను నిలబెట్టాలని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఆర్ఆర్ విడుదలై మంచి విజయం సాధించింది. దాంతో చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాతో రాజ‌మౌళి మ‌రోసారి తెలుగు సినిమా స్టామినాను పాన్ ఇండియాకు ప‌రిచ‌యం చేశారు.

ALSO READ : చిరంజీవి, శ్రీదేవి రిజెక్ట్ చేసిన‌ అద్భుత‌మైన సినిమా ఏదో తెలుసా…!

Visitors Are Also Reading