Home » టీవీ రేటింగ్స్ లో కూడా ఆర్ఆర్ఆర్ తగ్గలేదుగా..?

టీవీ రేటింగ్స్ లో కూడా ఆర్ఆర్ఆర్ తగ్గలేదుగా..?

by Azhar
Ad
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా విడుదలై 1100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. అయితే బహువాలి వంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి తీసుకున్న సినిమా కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు అనేవి నెలకొన్నాయి. అలాగే రాజమౌళితో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా కావడం వాళ్ళ టాలీవుడ్ లో ఆ అంచనాలు ఇంకా ఎత్తుకు వెళ్లాయి.
అయితే ఈ సినిమాను ఎప్పుడు 2019 లో ప్రారంభించగా.. 2022 మార్చ్ లో విడుదల చేసారు. కరోనా కారణంగా ఈ సినిమా లేటుగా వచ్చిన దీనిపైన హైప్ అనేది తగ్గలేదు. అలాగే ఊహించిన విధంగానే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఓటీటీలో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ మధ్యే ఈ ఆర్ఆర్ఆర్ టీవీలో కూడా వచ్చింది.
అయితే సినిమా హైప్ వాళ్ళ చాలామంది ఆర్ఆర్ఆర్ ను థియేటర్లో చూడగా.. మిగిలిన వారు ఓటీటీలో చూసేసారు. కాబట్టి టీవీలో ఎక్కువ మంది ఈ సినిమాను చూడరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఆర్ఆర్ఆర్ టీవీలో కూడా తగ్గేదేలే అనే విధంగా రేటింగ్స్ అనేవి తెచ్చుకుంది. మన తెలుగులో ఈ సినిమా యొక్క టీవీ రేటింగ్స్ అనేవి 19.6 గా ఉన్నాయి. ఇంత ఆలస్యంగా టీవీలోకి వచ్చినా ఈ రేటింగ్స్ అనేవి రావడం పెద్ద విషయం అనే చెప్పాలి.

Advertisement

Visitors Are Also Reading