Home » RRR FIRST REVIEW : ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది…సినిమాలో హైలెట్ అదేన‌ట‌..!

RRR FIRST REVIEW : ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది…సినిమాలో హైలెట్ అదేన‌ట‌..!

by AJAY
Ad

RRR Movie Review: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా లెజెండ‌రీ రైట‌ర్ విజయేంద్ర‌వర్మ క‌థ‌ను అందించారు. ఈ సినిమాలో మ‌న్యం వీరుడు అల్లూరిగా చ‌ర‌ణ్, గోండు బెబ్బులి కొమురం భీంగా ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్నారు. అంతే కాకుండా సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ పాప ఒలివియా మోరిస్ న‌టిస్తుండ‌గా…చెర్రీకి జోడీగా బాలీవుడ్ పాప అలియాభ‌ట్ న‌టించింది. అంతే కాకుండా సినిమాలో బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్ గ‌న్ మ‌రియు హీరోయిన్ శ్రీయ కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఈ సినిమా ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో అల‌రిస్తోంది. ఇక ప‌న్నెండు భాష‌ల్లో జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. దాంతో ప్ర‌మోష‌న్స్ లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే సినిమా విడుద‌ల‌కు ఇంకా దాదాపు వారం రోజులు ఉంది. అయితే ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా ఈ సినిమా ఎలో ఉండ‌బోతుందో రివ్యూ ఇచ్చేసింది. ఆ రివ్య్వూ ప్ర‌కారంగా….ఆర్ఆర్ఆర్ సినిమా విజువ‌ల్ వండ‌ర్ గా ఉండ‌బోతుంద‌ట‌.

Advertisement

Advertisement

ALSO READ: Bahubali-3 : బాహుబలి సిరీస్ కంటిన్యూ…పార్ట్ -3 పై జనవరి 1న ప్రకటన…!

సినిమాలో ఇద్ద‌రూ హీరోల స్నేహం చిత్రానికే హైలెట్ గా నిల‌వ‌బోతుంద‌ట‌. రాజ‌మౌళి ఈ సినిమాను అంచ‌నాల‌ను ఏ మాత్రం త‌గ్గ‌కుండా తెర‌కెక్కించాడ‌ని పేర్కొంది. ఇక సినిమా ఆద్యంతం ఆక‌ట్టుకునే విధంగ‌గా ఉత్కంట బ‌రితంగా ఉండబోతుంద‌ట‌. హిందీలోనే కాకుండా ప్రాంతీయ భాష‌ల్లో కూడా ఈ సినిమా ఘ‌న‌విజయం సాధిస్తుంద‌ని బాలీవుడ్ మీడియా బెబుతోంది. బాహుబ‌లితో సంచ‌ల‌నాలు సృష్టించిన జ‌క్క‌న్న ఈ సినిమాతో ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటారో చూడాలంటే జ‌న‌వ‌రి 7వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading