Home » బాహుబ‌లి కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొట్టిన ఆర్ఆర్ఆర్..ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..!

బాహుబ‌లి కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొట్టిన ఆర్ఆర్ఆర్..ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..!

by AJAY
Ad

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బాహుబలి 2 సినిమా రికార్డులను ఆర్ఆర్ బద్దలు కొట్టింది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ మొదటిరోజు కలెక్షన్ల వివరాలను వెల్లడించారు.

Advertisement

త‌రుణ్ ఆద‌ర్శ్ చేసిన పోస్ట్ ప్రకారం….ఆర్ఆర్ఆర్ సినిమా బాహుబలి-2 ఓపెనింగ్ రికార్డులను బద్దలు కొట్టేసింది. దాంతో ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 263 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు త‌రుణ్ ఆద‌ర్శ్ త‌న పోస్ట్ లో పేర్కొన్నారు.

Advertisement

ఇండియాలో రూ.156 కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా కేవలం అమెరికాలో రూ. 42 కోట్ల వసూళ్ల‌ను ఈ సినిమా రాబట్టింది. అదేవిధంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు ఇతర దేశాలలో మరో రూ.25 కోట్ల వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉంటే భారతదేశంలో ఆర్ఆర్ఆర్ వసూళ్లు చూసినట్లయితే ఏపీలో ఈ సినిమాకు రూ.75 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంతే కాకుండా నైజాంలో రూ.27.5 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఉత్త‌రాధి రాష్ట్రాలలో ఈ సినిమాకు 25 కోట్ల వ‌సూళ్లు రాగా కర్ణాటకలో 14.5 కోట్లు, తమిళనాడులో 10 కోట్ల వ‌సూళ్ల‌ను రాబట్టింది. అంతేకాకుండా కేరళలో ఈ సినిమాకు రూ.4 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.

Visitors Are Also Reading