Telugu News » Blog » RRR వసూళ్ల సునామీ…. రెండో రోజు అక్కడ భారీ వ‌సూళ్లు….!

RRR వసూళ్ల సునామీ…. రెండో రోజు అక్కడ భారీ వ‌సూళ్లు….!

by AJAY
Ads

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. భారీ విజువ‌ల్స్ తో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్లో ఈ సినిమాకు మొదటి రోజు రూ.18 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

Advertisement

rrr-movie-review

Advertisement

అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో రెండో రోజు రూ. 24 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెండో రోజు ఈ సినిమాకు రూ.107 నుండి 137 కోట్ల మధ్య వసూలు చేసినట్లు సమాచారం అందుతోంది. దాంతో రెండు రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Advertisement

ఇక ఆదివారం ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బాహుబలి-2 ను ఈ సినిమా బీట్ చేస్తుందా లేదా అని అంతా అనుమానం వ్యక్తం చేశారు. కానీ మొదటి రోజు బాహుబలి-2 రికార్డులను బద్దలు కొట్టేసింది. భారీ అంచ‌నాల‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. అంతేకాకుండా ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయే అవకాశాలున్నాయని కూడా విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

You may also like