Home » ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ పై జ‌క్క‌న్న క్లారిటీ….ఫ్యాన్స్ హ్యాపీ..!

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ పై జ‌క్క‌న్న క్లారిటీ….ఫ్యాన్స్ హ్యాపీ..!

by AJAY
Ad

మెగాప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లు క‌లిసి న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా అలియాభ‌ట్ హీరోయిన్ గా న‌టించగా ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్ హీరోయిన్ గా న‌టించింది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా సంక్రాంతి విడుద‌ల కావాల్సి ఉంది.

RRR FIRST RIVEW

Advertisement

కానీ క‌రోనా కేసుల కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా పడింది. దాంతో తిరిగి మార్చి 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌టించింది. అంతే కాకుండా చిత్ర‌యూనిట్ మ‌ళ్లీ ప్రమోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా మారింది. ఇదిలా ఉంటే టీజ‌ర్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌డంతో సినిమా పై ర‌క‌ర‌కాల వార్త‌లు పుట్టుకువ‌స్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా సినిమాలో క్లైమాక్స్ లో ఇద్ద‌రి ఒకరు చ‌నిపోతారంటూ గాసిప్ లు మొద‌ల‌య్యాయి.

Advertisement

RRR ACTORS REMUNARATIONS

లేదంటూ విక‌లాంగులు అయ్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయంటూ పుకార్లు గుప్పుమ‌న్నాయి. అయితే జ‌క్క‌న్న త‌న తెలివితే ఆ పుకార్ల‌కు చెక్ పెట్టారు. సినిమా విడుద‌ల‌కు ఇంకా ప‌ది రోజులే మిగిలి ఉండ‌గా సినిమా నుండి క్లైమాక్స్ సాంగ్ ఎత్త‌ర జెండా ను విడుద‌ల చేశారు. ఇక ఈ సాంగ్ లో అలియా భ‌ట్ తో పాటూ రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ లు ఉన్నారు. దాంతో సినిమా క్లైమాక్స్ లో ఇద్ద‌రూ ఉంటార‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

Visitors Are Also Reading