ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకలలో ఆస్కార్ ముందు వరుసలో ఉంటుంది. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ భారతదేశం తరుపున ఆస్కార్ కి నామినేట్ అవుతుందని అందరూ ఆకాంక్షించారు. కానీ మనదేశం తరుపున గుజరాత్ సినిమా అయినటువంటి ఛలో షో సినిమాను నామినేట్ చేశారు. దీంతో ఈ సినిమాను నేరుగా ఆస్కార్ కి పంపించేందుకు చిత్ర యూనిట్ స్వయంగా ప్రయత్నాలను ప్రారంభించింది. తాజాగా 2023 షార్ట్ లిస్ట్ లో ఒక్క విభాగంలోనే ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది.
Advertisement
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25, 2022న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు స్థానం దక్కించుకొంది. డిసెంబర్ 12న 10 విభాగాలలో ఎంపిక చేసిన సినిమాల షార్ట్ లిస్ట్ జాబితాను అకాడమీ ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ తో పాటు భారతీయ సినిమా దిలాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ చేయబడింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో 15 చిత్రాలకు చెందిన పాటలను షార్ట్ లిస్ట్ చేశారు.
Advertisement
Also Read : స్టార్ విలన్ రఘువరున్ బావమరిది కూడా మనకు బాగా తెలిసిన విలన్..? ఆయన ఎవరంటే..?
అందులో నాటు నాటు తో పాటు అవతార్ 2లోని నథింట్ ఈ లాస్ట్, బ్లాక్ ఫాంథర్ లోని లిప్ట్ మీ ఆప్, టాప్ గన్ సినిమాలోని హోల్డ్ మై హాండ్ వంటి పాటలున్నాయి.ఇక 15 సినిమాల నుంచి జనవరిలో 5 సినిమాలను మాత్రమే ఆస్కార్ కి నామినేట్ చేస్తారు. ఆ సినిమాలు మాత్రమే ఆస్కార్ కి పోటీ పడతాయి. మరోవైపు జనవరి రెండో వారంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్స్ ని షార్ట్ లిస్ట్ ని ప్రకటించనున్నారు. 15 కేటగిరీలలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ కి దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఒక కేటగిరిలో షార్ట్ లిస్ట్ అయింది. దీంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్చి 12న హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.
#NaatuNaatu got shortlisted 💥💥💥
Congratulations @mmkeeravaani Gaaru #RRRforOscars pic.twitter.com/XjubBtgeGD
— Thyview (@Thyview) December 21, 2022