Home » అవతార్ 2 ను సైతం వెనక్కి నెట్టిన ఆర్ఆర్ఆర్….!

అవతార్ 2 ను సైతం వెనక్కి నెట్టిన ఆర్ఆర్ఆర్….!

by AJAY
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా విడుదల అయింది. కాగా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను విడుదల చేయగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.

Advertisement

అంతేకాకుండా రీసెంట్ గా ఈ సినిమాను అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ కెమెరాన్ సైతం ప్రశంసించారు. ఇక ఈ సినిమాకు ప్రశంసలు రావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ కాగా తాజాగా ఈ సినిమాకు రోటెన్ టొమాటోస్ అవార్డు వచ్చింది.

Advertisement

రోటెన్ టొమాటోస్ సంస్థ నిర్వహించిన ఫ్యాన్స్ ఫేవరెట్ 2022 సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాదికి గాను గోల్డెన్ టొమాటో అవార్డుకు అవతార్ ది వే ఆఫ్ వాటర్, బ్యాట్మెన్ లాంటి హాలీవుడ్ చిత్రాలు పోటీ పడగా ఆర్ఆర్ఆర్ వాటిని వెనక్కి నెట్టేసింది.

తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో గుర్తింపు రావడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఇండియన్ సినిమా అవతార్ లాంటి భారీ బడ్జెట్ సినిమాను వెనక్కినెట్టి అవార్డును సొంతం చేసుకోవడం అంటే గర్వించాల్సిన విషయం.

Also read : “పవన్ మీ బావనా” అంటూ నెటిజన్ కామెంట్….షాకింగ్ రిప్లై ఇచ్చిన శ్రీరెడ్డి..!

Visitors Are Also Reading