Home » రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు.. ఏంటో తెలుసా..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డు.. ఏంటో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు ఇండస్ట్రీలో రౌడీ హీరో గా పేరు పొందిన విజయ్ దేవరకొండ అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన సరికొత్త నటనతో ముందుకు పోతున్నారు. అత్యంత తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల స్థానంలో పేరు సంపాదించుకున్నారు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ మూవీస్ తో భారీ హిట్లు అందుకున్న విజయ్ పాపులారిటీ మరింత పెరిగి పోయింది.

అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఈ రౌడీ హీరో సినిమా రాలేదు. ఇన్ని రోజుల నుంచి ఫ్యాన్స్ ను వెయిట్ చేయించిన విజయ్ సెన్సేషనల్ డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా కచ్చితంగా రికార్డులను బద్దలు కొడుతుందని పూరి అభిమానులు, విజయ్ అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే మూవీ రిలీజ్ కు ముందే దేవరకొండ సరికొత్త రికార్డు సృష్టించారు అని చెప్పవచ్చు.

 

ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను సాధించినటువంటి ఫాస్టెస్ట్ సౌత్ ఇండియా హీరోగా విజయ్ నిలిచాడు. ఇంస్టాగ్రామ్ లో చాలా త్వరగా 15 మిలియన్ల ఫాలోవర్స్ ను సాధించిన హీరోగా రికార్డులు సాధించాడు. టాలీవుడ్ లో విజయ్ కన్నా ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 18 మిలియన్ల ఫాలోవర్ లతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానంలో 8.3 మిలియన్లకు ప్రభాస్, 8.1 మిలియన్ల తో మహేష్ బాబు ఉన్నారు. వీరిద్దరి కంటే దేవరకొండ ముందు ఉండడం చాలా అద్భుతం. దీంతో విజయ అభిమానులు పట్టరాని సంతోషంలో ఉన్నారని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి:

ఇచ్చిన దానికి వందరెట్లు తిరిగి ఇవ్వాలంటున్న.. శ్రీజా కొణిదెల..!!

సపోటా పండ్లు తింటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌తో పోటీ ఉందా..? ప్ర‌భాస్ ఆన్స‌ర్ ఇదే…!

Visitors Are Also Reading